
హైదరాబాద్‌సిటీ, వెలుగు: రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆర్పీ సింగ్పై సీసీఎస్‌లో కేసు నమోదైంది. ఖాజాగూడలోని సర్వే నంబర్ 19లోని 10.32 ఎకరాల భూమి విషయంలో ఆయన చిక్కుల్లో పడ్డారు. ఈ భూమిలో 3 ఎకరాలను తన కుమార్తె చేతన్ కౌర్ పేరిట ఆర్పీ సింగ్ గిఫ్ట్ డీడ్ చేయగా, ఆ తర్వాత రహస్యంగా రద్దు చేశారు. ఈ విషయాన్ని దాచిపెట్టి ఐ టవర్ నిర్మాణ సంస్థకు ఒప్పందం ప్రకారం కమర్షియల్ కాంప్లెక్స్ కోసం ఇచ్చారు. ఐ టవర్స్‌లో 80 శాతం నిర్మాణాలు పూర్తి కాగా, 672 మంది ఫ్లాట్లు కొనుగోలు చేశారు. వీరిలో బ్యూరోక్రాట్లు, రాజకీయ నాయకులు, సామాన్యులు ఉన్నారు.
అయితే, ఐ టవర్స్ ప్రతినిధులు బ్యాంకు రుణం కోసం వెళ్లగా, గిఫ్ట్ డీడ్ విషయం బయటపడింది. దీంతో ఐ టవర్ యాజమాన్యం ఫిర్యాదుతో ఆర్పీ సింగ్పై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.