గోల్డ్ షాపుల్లో  ఉంగరాల దొంగ అరెస్ట్

గోల్డ్ షాపుల్లో  ఉంగరాల దొంగ అరెస్ట్

కూకట్​పల్లి, వెలుగు: జువెలరీ షాపుల్లో నిర్వాహకుల కళ్ళుగప్పి బంగారు ఉంగరాలను దొంగిలిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. బీరంగూడకు చెందిన మేరుగు సాగర్ (30) జనవరి, ఫిబ్రవరి నెలల్లో కూకట్​పల్లిలోని సీఎంఆర్ షాపింగ్ మాల్, మలబార్ గోల్డ్​తో పాటు పంజాగుట్టలోని సీఎంఆర్ మాల్​ను టార్గెట్ చేశాడు.

షాపుల్లో ఉంగరాలు కొనేందుకు వచ్చి, సిబ్బంది దృష్టి మళ్లించి అసలు బంగారు ఉంగరాల స్థానంలో తన వద్ద ఉన్న రోల్డ్ గోల్డ్ ఉంగరాలను ట్రేలో ఉంచి చాకచక్యంగా పారిపోయేవాడు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా బుధవారం నిందితుడిని అరెస్ట్ చేశారు.