- వచ్చే నెల నుంచి పాన్కు డీఓబీ తప్పనిసరి
- రూల్స్ కఠినం చేసిన ప్రభుత్వం
న్యూఢిల్లీ: పాన్ కార్డ్ కోసం ఈ నెల 31 లోపు అప్లయ్ చేసుకోవడం బెటర్. ఏప్రిల్ 1 తర్వాత అప్లయ్ చేసేవాళ్లు ఆధార్‌తో పాటు డేట్ ఆఫ్ బర్త్ (డీఓబీ) ప్రూఫ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆధార్ ఉంటే సరిపోతోంది. కొత్త రూల్స్ ప్రకారం, పాన్‌లో పేరు ఆధార్‌లో ఉన్న పేరుతో 100శాతం మ్యాచ్ కావాలి. డీఓబీ ప్రూఫ్ కోసం బర్త్ సర్టిఫికేట్, వోటర్ ఐడీ, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్,10వ తరగతి సర్టిఫికేట్, అఫిడవిట్ (మేజిస్ట్రేట్ ముందు సంతకం చేసినది)లలో ఏదో ఒకటి వాడొచ్చు.
