అఖిలేష్ యాదవ్, జయంత్ చౌదరీపై కేసు నమోదు

అఖిలేష్ యాదవ్, జయంత్ చౌదరీపై కేసు నమోదు

సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, రాష్ట్రీయ లోక్దళ్ చీఫ్ జయంత్ చౌదరీపై కేసు నమోదైంది. వారితో పాటు మరో 400 మందిపై నోయిడాలోని దాద్రీ పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వీరంతా కొవిడ్ 19 నియమాలను ఉల్లంఘించారని అందులో పేర్కొన్నారు. గురువారం రాత్రి గ్రేటర్ నోయిడాలో నిర్వహించిన ర్యాలీలో ఇరువురు నేతలు పాల్గొన్నారు. ఈ ర్యాలీకి భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు. దీంతో ఈసీ విధించిన పరిమితికి మించి జనం హాజరయ్యారని కంప్లైంట్ అందడంతో పోలీసులు అఖిలేష్, జయంత్ చౌదరీపై కేసు బుక్ చేశారు.  

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ, ఆర్ఎల్డీలు కలిసి పోటీ చేస్తున్నాయి. ఈ కూటమి బీజేపీకి గట్టి పోటీ ఇస్తుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 403 స్థానాలున్న యూపీ అసెంబ్లీకి ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 10న తొలి విడత ఓటింగ్ జరగనుండగా.. మార్చి 7న తుది దశ పోలింగ్ నిర్వహించనున్నారు. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి. 

మరిన్ని వార్తల కోసం..

రాజన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే రఘునందన్

స్థానిక ప్రజాప్రతినిధుల తీరుపై యువకుడి సెల్ఫీ వీడియో