స్థానిక ప్రజాప్రతినిధుల తీరుపై యువకుడి సెల్ఫీ వీడియో

స్థానిక ప్రజాప్రతినిధుల తీరుపై యువకుడి సెల్ఫీ వీడియో

స్థానిక ప్రజాప్రతినిధుల తీరును సెల్ఫీ వీడియో ద్వారా ఎండగట్టాడు ఓ యువకుడు. నిబంధనల ప్రకారం ఇంటిని నిర్మించుకుంటున్నప్పటికీ గ్రామ సర్పంచ్ తో పాటు ఇతర అధికారులు అడ్డుకుంటున్నారని తెలిపాడు. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గోరంటాల గ్రామానికి చెందిన నవీన్ గౌడ్ అనే వ్యక్తి తన పాత ఇంటిని రీ కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాడు. దీన్ని గ్రామ ప్రజాప్రతినిధులు అడ్డుకున్నారు. వారు కక్ష పూరితంగానే అడ్డుకుంటున్నారని యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. నిబంధనల ప్రకారమే నిర్మిస్తున్నప్పటికీ ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపాడు. తన తప్పు లేకున్న తనని అరెస్ట్ చేయించారంటూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశాడు.