అర్వింద్ ​కాన్వాయ్​పై దాడి ఘటనలో కేసులు నమోదు

అర్వింద్ ​కాన్వాయ్​పై దాడి ఘటనలో కేసులు నమోదు

ఇబ్రహీంపట్నం : ఎంపీ ధర్మపురి అర్వింద్ ​కాన్వాయ్​పై దాడి ఘటనలో పోలీసులు 14 మందిపై కేసు నమోదు చేశారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు ఎంపీ శుక్రవారం జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్ధండి గ్రామానికి వెళ్లగా టీఆర్ఎస్​కార్యకర్తలు కాన్వాయ్​పై దాడికి పాల్పడ్డారు. దాడిలో పాల్గొన్న 14 మందిపై ఇబ్రహీంపట్నం పోలీస్​ స్టేషన్​లో శనివారం 143, 147, 341, 427, 323, 504 r/w 149 IPC  సెక్షన్ల కింద కేసు ఫైల్​ చేశారు. కేసు నమోదైన వారిలో ఎర్ధండి ఉపసర్పంచ్​శేఖర్, టీఆర్ఎస్​లీడర్లు రాజశేఖర్, రాకేశ్, వరుణ్​రాజ్, శంకర్, నాగరాజు, చక్రధర్, చిన్నరాజన్న, సుభాశ్, రాజు, ఆదర్శ్, నవీన్, భరత్, శివ ఉన్నారు. వీరిలో 10 మందిని శనివారం మెట్​పల్లి మున్సిఫ్​కోర్టులో హాజరుపర్చగా మేజిస్ట్రేట్ పద్మావతి​ బెయిల్​మంజూరు చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్పారు.