వణికిస్తోన్న జ్వరం..రోజూ లక్షమంది ఆస్పత్రులకు

వణికిస్తోన్న జ్వరం..రోజూ లక్షమంది ఆస్పత్రులకు

హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలో సీజనల్ జ్వరాలు వణికిస్తున్నాయి. కొన్ని ఊర్లలో ప్రతి ఇంటా ఫీవర్‌‌తో బాధపడుతున్న వాళ్లు ఉన్నారు. పీహెచ్‌సీల నుంచి కమ్యూనిటీ, ఏరియా, జిల్లా ఆస్పత్రుల దాకా పరుగులు తీస్తున్నారు. సర్కార్ దవాఖానలకు వస్తున్న వారిలో 10 శాతం మంది ఇన్ పేషెంట్లుగా చేరుతుండగా, ప్రైవేటులో 25 శాతం మంది ట్రీట్‌మెంట్ కోసం జాయిన్ అవుతున్నారు. హైదరాబాద్, ఖమ్మం, రంగారెడ్డి, కొత్తగూడెం, మేడ్చల్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో డెంగీ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. కొత్తగూడెం, హైదరాబాద్, మలుగు జిల్లాల్లో వందకు పైగా మలేరియా కేసులు నమోదయ్యాయి.

డైలీ లక్ష మంది..

ప్రస్తుతం రాష్ట్రంలో డైలీ ఫీవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో బాధపడుతూ 80 వేల మంది నుంచి లక్ష మంది దాకా హాస్పిటల్స్​ను ఆశ్రయిస్తున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. కొన్ని జిల్లా జిల్లాల్లో ఐపీలో బెడ్స్ సరిపోక ఒకే బెడ్‌‌‌‌‌‌‌‌పై ఇద్దరు పేషెంట్లకు ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్ అందిస్తున్నారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని నిలోఫర్ పిల్లల హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ వేయి పడకలు ఉండగా.. ప్రస్తుతం అన్నీ ఫుల్ అయ్యాయి. పేషెంట్ల తాకిడి పెరుగుతుండటంతో ఒకే బెడ్​పై ఇద్దరు చిన్నారులకు ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్​ అందిస్తున్నారు. ఇక రాష్ట్రంలో జ్వర బాధితుల్లో 50 శాతానికిపైగా13 ఏళ్ల లోపు పిల్లలే ఉంటున్నారు. ఎక్కువగా డెంగీ, మలేరియా, టైఫాయిడ్, కలరా, న్యుమోనియా బారిన పడ్డవాళ్లే ఉంటున్నారు. నిలోఫర్ పిల్లల దవాఖానకు వస్తున్న వారిలో డెంగీ, న్యుమోనియాతో బాధపడుతున్న వారే ఉన్నారు. ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌లోని రిమ్స్, వరంగల్ ఎంజీఎం హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌కి కూడా పేషెంట్ల తాకిడి ఎక్కువగా ఉంది.

ఇప్పటిదాకా 2,700 డెంగీ కేసులు

రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది 2,700 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఎక్కువగా జులై, ఆగస్టు, ఈ నెలలోనే నమోదయ్యాయి. లాస్ట్ ఇయర్ కరోనా కారణంగా అందరు జాగ్రత్తలు పాటించడంతో డెంగీ కేసులు తగ్గాయి. 1,244 మాత్రమే  నమోదయ్యాయి. జిల్లాల నుంచి హైదరాబాద్​కు రిఫర్
డెంగీ, మలేరియా బారిన పడిన వారు జిల్లాల్లో ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్ పొందుతున్నారు. పరిస్థితి విషమిస్తే పేషెంట్లను  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని ఫీవర్, గాంధీ, ఉస్మానియా, నిలోఫర్ హాస్పిటల్స్​కి రిఫర్ చేస్తున్నారు. ప్రస్తుతం సిటీలోని ఒక్కో దవాఖానకు జిల్లాల నుంచి కనీసం 10 వరకు రిఫర్ కేసులు వస్తున్నాయి. జిల్లా హాస్పిటల్స్​లో అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నప్పటికీ.. హైదరాబాద్ ఆస్పత్రులకు రిఫర్ చేసి డాక్టర్లు చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, హైదరాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్, మెదక్ జిల్లాల్లో సీజనల్ వ్యాధులు ఎక్కువగా నమోదవుతున్నాయి. వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టేంత వరకు పరిస్థితి ఇలాగే ఉండనుందని డాక్టర్లు చెబుతున్నారు. అన్ని ప్రభుత్వ దవాఖానల ఓపీలు డబుల్ అయ్యాయని.. 10 రోజులుగా ఇలాగే ఉన్నట్లు పేర్కొంటున్నారు.

ఓపీ డబుల్ అయింది

కొద్దిరోజులుగా ఓపీకి వస్తున్న పేషెంట్ల సంఖ్య డబుల్ అయింది.​ మొన్నటి వరకు 700 మంది వచ్చేది. ఇప్పుడు 1,100 మందికి పైగా వస్తున్నారు. ఇందులో డైలీ 150 మందిని ఇన్‌‌‌‌‌‌‌‌పేషెంట్ గా చేర్చుకుని ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్ ఇస్తున్నం. అనుమానం ఉన్న వారికి డెంగీ, మలేరియా, కరోనా టెస్టులు చేస్తున్నం. ఎక్కువగా డెంగీ, న్యుమోనియా కేసులు వస్తున్నాయి.  
- డాక్టర్ మురళీ కృష్ణ
సూపరింటెండెంట్​, నిలోఫర్ హాస్పిటల్ 

వైరల్ ఫీవర్స్ పెరిగినయ్

కొద్ది రోజులుగా వైరల్ ఫీవర్స్ తో బాధపడుతున్న వారు ఎక్కువయ్యారు. ఓపీలో ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్ కోసం వస్తున్న వారి సంఖ్య చాలా పెరిగింది. మంగళవారం ఒక్కరోజే 1,214 మంది వచ్చారు. ఇందులో వైరల్ పీవర్స్ తో వస్తున్న వారిని అవసరమైతే అడ్మిట్ చేసుకుంటున్నం. 
- డాక్టర్ మల్లికార్జున్, సూపరింటెండెంట్, వికారాబాద్ జిల్లా ఆస్పత్రి