నోట్లు అడిగినోళ్లపై కేసులు

నోట్లు అడిగినోళ్లపై కేసులు

హుజూరాబాద్​ బైపోల్​లో తమకు డబ్బులివ్వలేదని ఆందోళన చేసిన వాళ్లపై కేసులు నమోదు చేస్తామని సీఈవో శశాంక్​ గోయల్​ స్పష్టం చేశారు. ఓటుకు డబ్బులు అడిగిన వాళ్లను గుర్తిస్తున్నట్లు చెప్పారు. దీనిపై ఇప్పటికే జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ ఫీల్డ్ లెవల్‌లో దర్యాప్తు చేస్తున్నారని శుక్రవారం ఆయన మీడియాతో అన్నారు. పైసలు అడిగినట్లు తేలితే క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సి ఉంటుందని చెప్పారు.  ఓటుకు డబ్బులు ఇవ్వడంతో పాటు తీసుకోవడం కూడా నేరం కిందికే వస్తుందన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే వాళ్లపై కూడా చర్యలు తీసుకుంటున్నట్లు సీఈవో  తెలిపారు. రాజకీయ పార్టీల నుంచి అనేక ఫిర్యాదులు వచ్చాయని, కొన్ని ఫిర్యాదులపై చర్యలు తీసుకున్నామన్నారు. ఇప్పటివరకు రూ. 3.50 కోట్లు పట్టుబడ్డాయన్నారు. తప్పుడు వార్తలు వ్యాప్తి చేసేవారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు.