ఓక్రిడ్జ్ స్కూల్లో కాస్నివాల్.. స్పెషల్ అట్రాక్షన్గా కేటీఆర్ కొడుకు

ఓక్రిడ్జ్ స్కూల్లో కాస్నివాల్.. స్పెషల్ అట్రాక్షన్గా కేటీఆర్ కొడుకు

ఓక్రిడ్జ్ స్కూల్ కాస్నివాల్లో మంత్రి కేటీఆర్ కొడుకు హిమాన్షు తన ప్రతిభతో ఆకట్టుకున్నాడు. సృజనాత్మక, సామాజిక థృక్పథం థీంతో నిర్వహించిన కాస్నివాల్కు హిమాన్షు ఇంచార్జ్గా వ్యవహిరించాడు. ఈవెంట్లో భాగంగా ఏర్పాటుచేసిన 30కి పైగా స్టాల్స్తో  విద్యార్థులు తమ కళాత్మకతను ప్రదర్శించారు.  ఫుడ్, ఫన్, గేమ్స్ ప్రదర్శనగా కొనసాగిన కాస్నివాల్లో ఓక్ జైలు, సైకిల్ పెయింటింగ్ స్టాల్స్, లైవ్ మ్యూజిక్ కన్సర్ట్ తో తమలోని ప్రతిభను చూపించారు. ఈ కాస్నివాల్కు మంత్రి సబితా ఇంద్రారెడ్డి, హీరోలు నిఖిల్, కిరణ్ అబ్బవరం హాజరయ్యారు. కాస్నివాల్లోని స్టాల్స్ను పరిశీలించి.. హిమాన్షు అతని స్నేహితుల సృజనాత్మకత, సామాజిక దృక్పథాన్ని అభినందించారు.

తమ కాస్నివాల్ ఈవెంట్ పర్యావరణం, విద్యకు మధ్య వారధి లాంటిదని హిమాన్షు అన్నారు. తాను చదువుతో పాటు సామాజిక సేవకూ సమ ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. చదువుకుని మంచి మార్కులు సంపాదించినప్పుడు ఎంత సంతోషిస్తానో అంతకంటే ఎక్కువ ఆనందాన్ని ఎవరికైనా సాయం చేసినప్పుడు పొందుతానన్నారు. కాస్నివాల్తో వచ్చే డబ్బులతో నానక్రామ్ గూడ చెరువును పునరుద్దరిస్తామన్న హిమాన్షు.. ఆ ప్రయత్నంలో విజయవంతం అయిన రోజు ప్రపంచాన్నే గెలిచినంత గొప్పగా ఫీలవుతానన్నారు. తమ ప్రయత్నానికి ప్రభుత్వం సహకారం అందిస్తోందని స్పష్టం చేశారు.