కుల గణన సర్వేను కొత్తగా చేపట్టాలి : యడియూరప్ప

కుల గణన సర్వేను కొత్తగా చేపట్టాలి : యడియూరప్ప

దావణగెరె: కర్నాటకలో కుల గణన క్రమ పద్ధతిలో జరగలేదని బీజేపీ వెటరన్ నాయకుడు బీఎస్. యడియూరప్ప ఆదివారం తెలిపారు. అందువల్ల కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా కుల గణన సర్వేను చేపట్టాలని డిమాండ్ చేశారు. ‘‘కుల గణన క్రమ పద్ధతిలో జరగలేదని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. నా అభిప్రాయం కూడా అదే. అందువల్ల ప్రభుత్వం కొత్తగా కుల గణన సర్వేను చేపట్టాలి. ప్రజల ముందు నిజాలను బయటపెట్టాలి. ఈ అంశంపై ప్రభుత్వం నిజాయతీగా ప్రయత్నాలు చేయాలని నేను కోరుతున్నాను” అని యడియూరప్ప చెప్పారు. 

కర్నాటకలో మెజార్టీ సామాజిక వర్గాలైన లింగాయత్, వక్కలిగలు ఇప్పటికే కుల గణన సర్వేపై అసంతృప్తి వ్యక్తం చేశాయి. కొత్తగా సర్వేను చేపట్టాలని కోరాయి. సిద్ధ రామయ్య సీఎంగా ఉన్నప్పుడే 2018లో కుల గణన సర్వే పూర్తయింది. కానీ, ఆ నివేదికను ప్రభుత్వం ఆమోదించలేదు, బహిరంగపర్చలేదు. బీహార్ ప్రభుత్వం ఇటీవల కుల గణన సర్వే ఫలితాలను విడుదల చేయడంతో, కర్నాటకలో కూడా వాటిని విడుదల చేయాలని కొన్ని సామాజిక వర్గాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.