విదేశాలకు వెళ్లినా కుల వివక్ష వెంటాడుతూనే ఉంది : ఘంటా చక్రపాణి

విదేశాలకు వెళ్లినా కుల వివక్ష వెంటాడుతూనే ఉంది : ఘంటా చక్రపాణి

విదేశాలకు వెళ్లినా కుల వివక్ష వెంటాడుతూనే ఉందని టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి అన్నారు. గ్రామాలను వదిలి నగరాలకు వెళ్తే కులం అనేది పోతుందని అంబేద్కర్ ప్రతిపాదన చేశారని.. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. పసునూరి రవీందర్ రచించిన కండిషన్స్ అప్లై అనే పుస్తకావిష్కరణ సభ రవీంద్రభారతిలో జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ కొలకలూరి ఇనాక్, దర్శకుడు వేణు ఊడుగులతో కలిసి ఘంటా చక్రపాణి పుస్తకాన్ని ఆవిష్కరించారు. స్వాతంత్య్రం ముందు ఉన్న కులవివక్ష నేటికి కొనసాగడం బాధాకరమని ఆయన అన్నారు. కుల వివక్షను తన రచనలతో సమాజానికి తెలియజేస్తున్న రచయిత రవీందర్ ను అభినందించారు. రవీందర్ రచనలు సృజనాత్మకంగా , నిర్మొహమాటంగా ఉంటాయని కొనియాడారు.