కుల వృత్తులను టెక్నాలజీతో అప్​గ్రేడ్ చేస్తున్నం : మంత్రి పొన్నం ప్రభాకర్

కుల వృత్తులను టెక్నాలజీతో అప్​గ్రేడ్ చేస్తున్నం  :  మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్/కంటోన్మెంట్, వెలుగు: కులవృత్తులను టెక్నాలజీతో అప్​గ్రేడ్ చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. కంటోన్మెంట్​మడ్​ఫోర్డ్​దోబీ ఘాట్ లో ఏర్పాటు చేసిన ఎలక్ట్రికల్​వాషింగ్ మెషీన్ ​దోబీఘాట్​ను మంగళవారం ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..  కులవృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నవారు టెక్నాలజీని అందిపుచ్చునేలా ప్రోత్సహిస్తామని చెప్పారు. ఏడాదిలోగా ప్రతి నియోజకవర్గంలో ఒక ఎలక్ట్రికల్ ​వాషింగ్ మెషీన్​ దోబీఘాట్ అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. వీటితోపాటు అన్ని రకాల వృత్తులను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రత్యేక శిక్షణ ఇచ్చి, ఆర్థిక సహకారం  అందిస్తామని, ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తామని చెప్పారు. 

ఏ కులానికి ఎంత వాటా ఉండాలన్న అంశంపై సర్వే చేపట్టినట్లు తెలిపారు. సర్వే ఆధారంగా సబ్​ప్లాన్​, ఆర్థిక న్యాయం, సామాజిక న్యాయం, రాజకీయ న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో హైదరాబాద్​జిల్లా కలెక్టర్ అనుదీప్, పలువురు కాంగ్రెస్​ నాయకులు పాల్గొన్నారు. అంతకు ముందు చాకలి ఐలమ్మ  విగ్రహానికి మంత్రి పొన్నం పూలమాలలు వేసి నివాళులర్పించారు. లబ్ధిదారులకు జీరో కరెంట్ కరెంట్​బిల్లు, రూ.500లకు గ్యాస్​ సిలిండర్ ​అందజేశారు. అలాగే బొల్లారంలో నిర్మించిన డైట్ కాలేజీ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ను మంత్రి పొన్నం ప్రభాకర్​మంగళవారం ప్రారంభించారు.