Hair Beauty Tips: జుట్టుకు ఆముదం మంచిదేనా.. ఎలా ఉపయోగించాలి

Hair Beauty Tips: జుట్టుకు ఆముదం మంచిదేనా.. ఎలా ఉపయోగించాలి

ఇప్పుడంటే కొబ్బరి, ఆల్మండ్, ఆర్గాన్, లెమన్ గ్రాస్... ఇలా బోలెడు హెయిర్ ఆయిల్స్ ఉన్నాయి. కానీ, ఇవేం లేని రోజుల్లో జుట్టు చిట్లినా, ఊడినా ఆముదమే మెడిసిన్. ఇప్పటికీ చాలా మంది అమ్మమ్మలు, నాన్నమ్మల హెయిర్ ట్రీట్మెంట్ ఇదే. అంతెందుకు పసిపిల్లల జుట్టుకి ఆముదాన్నే పట్టిస్తారు. కానీ, కేవలం పసిపిల్లలకే కాదు పెద్దలకీ ఆముదాన్ని మించిన బెస్ట్ హెయిర్ ఆయిల్ మరొకటి లేదు. వివిధ రకాల మెడిసిన్స్ లో వాడే ఆముదం వల్ల జుట్టుకి బోలెడు లాభాలున్నాయి. 

అవేంటంటే..

* ఆఫ్రికాలోని ఇథియోపియా నుంచి ఆముదం అన్ని దేశాలకు పరిచయమైంది. రిసినస్ కమ్యూనిస్ మొక్క విత్తనాల నుంచి తీసే ఈ ఆయిల్లో మెడిసినల్ వాల్యూస్ చాలా ఎక్కువ. కొబ్బరి, ఆర్గాన్ ఆయిల్స్ లో మాదిరిగానే ఆముదంలోనూ ఫ్యాటీయాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టుకి మాయిశ్చరైజర్ లా పనిచేయడంతో పాటు దాని పెరుగుదలకి అవసరమయ్యే పోషకాలనిస్తాయి. 

* ఆముదంలో ఒమెగా-6, ఒమెగా -9 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ. ఈ నూనె జుట్టులోని సహజ తేమని, నేచురల్ ఆయిల్స్ ని కాపాడుతుంది. తలస్నానం చేసినా జుట్టు వాటిని కోల్పోకుండా చూస్తుంది. అలాగే ఇందులోని అమైనో యాసిడ్స్ జుట్టుకి నేచురల్ అమోలియెంట్స్(నొప్పినుంచి చర్మాన్ని కాపాడేది) గా పనిచేస్తాయి. 

* మాడు ఆరోగ్యంగా ఉండాలంటే ఆముదం వాడాలి. తలలో చుండ్రు, దురద సమస్యలుంటే ఈ నూనెని మించిన మెడిసిన్ లేదు. ఈ ఆయిల్లోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీలు మాడుని ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడతాయి. 

* తల స్నానానికి అరగంట ముందు ఆముదం నూనెతో మాడుపై మసాజ్ చేస్తే ఇన్ఫెక్షన్లు దరిచేరవు.. 

* ఆముదంలోని విటమిన్ ఇ జుట్టుని అందంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టుని ఫ్రీ ర్యాడికల్ డ్యామేజ్ నుంచి కాపాడతాయి. జుట్టు కుదుళ్లని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ నూనెలో ఉండే ఆల్ఫా- టోకోఫెరోల్ మాడలో రక్త ప్రసరణ మెరుగు పరిచి జుట్టు ఆరోగ్యంగా పెరిగేలా చేస్తాయి.

* మిగతా హెయిర్ ఆయిల్స్ కన్నా ఆముదం నూనె మందంగా ఉంటుంది. దానికి కారణం దీనిలో ఉండే ఫ్యాట్. అది స్కాల్ని మాయిశ్చరైజ్ చేసి జుట్టులోని పీహెచ్ని బ్యాలెన్స్ చేస్తుంది. దీనివల్ల జుట్టు పొడి బారదు. ఈ నూనెని గోరు వెచ్చగా కాచి జుట్టుకు పట్టిస్తే జుట్టు కుదుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.

* ఆముదంలోని ఒకేయిక్, లినోలెయిక్ యాసిడ్స్ స్ట్రెస్, పొల్యూషన్, సరిగా కేర్ తీసుకోకపోవడం వల్ల పాడైన జుట్టుని రిపేర్ చేస్తాయి.

* రాత్రి పడుకునే ముందు ఈ నూనెని జుట్టుకి రాస్తే జుట్టు చిట్లడం. జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు మెరుస్తుంది కూడా. 

Also Read :-  యుక్త వయస్సులో తక్కువ నిద్రతో వచ్చే ఇబ్బందులు ఇవే