
హైదరాబాద్: మార్కులు సరిగా రాలేదని తండ్రి మందలించడంతో 20 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో జరిగింది.
శ్రీ చరణ్ (20) అనే యువకుడు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉన్నత విద్యకు చదివేందుకు సిద్ధమవుతున్నాడు. క్యాట్ రాసి ఏదైనా ఐఐఎంలో ఎంబీఏ చేయాలని కలలు కన్నాడు. అందుకోసం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పీజేఆర్ నగర్‌లో ఓ హాస్టల్‌లో ఉంటూ కోచింగ్ తీసుకుంటున్నాడు. కానీ కొద్ది రోజుల్లోనే పరీక్ష ఉందనగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కానీ కోచింగ్‌లో ప్రాక్టీస్ టెస్లుల్లో మార్కులు సరిగ్గా రాలేదని తండ్రి రతన్ లాల్ అతడిని మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన శ్రీ చరణ్.. హాస్టల్ బిల్డింగ్ పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నవంబరు 24న క్యాట్ ఎగ్జామ్..
ఈ ఏడాది క్యాట్ ఎగ్జామ్‌ను కోజికోడ్ ఐఐఎం నిర్వహిస్తోంది. ఈ నెల 24న పరీక్ష జరగబోతోంది. ఈ పరీక్షకు హాల్ టికెట్లు అక్టోబరు 23న ఆన్ లైన్‌లో అందుబాటులో ఉంచారు. నవంబరు 24 వరకు అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫరీక్ష రిజల్ట్ 2020 జనవరి 6వ తేదీన ప్రకటిస్తారు.