గిరిజన విద్యార్థులతో ఆహారం వడ్డింపు

గిరిజన విద్యార్థులతో ఆహారం వడ్డింపు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గిరిజన గురుకుల విద్యార్థులు సర్వెంట్లుగా మారారు. కొత్తగూడెంలో టీఎన్జీవో భవన శంకుస్థాపన కార్యక్రమంలో కిన్నెరసాని గిరిజన గురుకుల విద్యార్థులు క్యాటరింగ్ చేశారు. విద్యార్థులకు ప్రత్యేక డ్రెస్సులు వేసి వారితో భోజనం వడ్డించారు.  

మైనర్లతోనూ క్యాటరింగ్..
కొత్తగూడెంలో టీఎన్జీవో భవన శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. అయితే కార్యక్రమం ముగిసిన తర్వాత అక్కడ భోజనం ఏర్పాటు చేశారు. శంకుస్థాపనకు వచ్చిన వారికి కిన్నెరసాని గిరిజన గురుకుల విద్యార్థులే భోజనం వడ్డించారు. విద్యార్థుల్లో కొందరు మైనర్లు ఉండటం గమనార్హం. 

విద్యార్థి సంఘాల ఆగ్రహం..
టీఎన్జీవో కార్యక్రమంలో అన్నం వడ్డిస్తున్న విద్యార్థులను జిల్లా బాలల సంరక్షణాధికారి హరికుమారి విచారించారు. విద్యార్థులు ఏ పాఠశాలలో చదవుతున్నారని అడిగి తెలుసుకున్నారు. అటు గిరిజన విద్యార్థులతో క్యాటరింగ్ నిర్వహించడంపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై విచారణ జరిపించి బాధ్యుతలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.