పెళ్లి చేసుకోబోతున్న కేథరిన్.. వరుడు ఎవరో తెలుసా?

పెళ్లి చేసుకోబోతున్న కేథరిన్.. వరుడు ఎవరో తెలుసా?

సౌత్  హీరోయిన్ కేథరిన్ థెరిసా(Catherine Tresa) పెళ్లి పీటలెక్కబోతోందట. తన చిన్ననాటి స్నేహితుడితో గత కొంత కాలంగా ప్రేమలో ఉన్న ఈ అమ్మడు. ఇటీవలే తన కుటుంబసభ్యులతో చెప్పేసిందట. అందుకు కేథరిన్ ఫ్యామిలీ కూడా ఒప్పుకోవడంతో.. త్వరలోనే వీరి పెళ్లి జరగనుందని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈ విషయంపై ఇరు కుటుంబాల నుండి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

ALSO READ :ఇది కదా సాలార్ రేంజ్.. ప్రభాస్ సరికొత్త రికార్డ్

ఇక కేథరిన్ సినిమాల విషయానికి వస్తే.. ఆమె తెలుగులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu arjun) హీరోగా వచ్చిన ఇద్దరమ్మాయిలతో(Iddarammayilatho) సినిమాతో టాలీవుడ్ ఎట్రీ ఇచ్చింది. ఆతరువాత కూడా వరుస ఆఫర్స్ అందుకుంది ఈ బ్యూటీ కానీ.. ఎందుకో కెరీర్ అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. ఇక చిరవరగా కేథరిన్ నితిన్(Nithin) హీరోగా వచ్చిన మాచర్ల నియోజకవర్గం(Macharla Niyojakavargam) అనే సినిమాలో కనిపించింది. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న కేథరిన్.. త్వరలో పెళ్లి చేసుకోనుందని తెలుస్తోంది.