ఇది కదా సలార్ రేంజ్.. ప్రభాస్ సరికొత్త రికార్డ్

ఇది కదా సలార్ రేంజ్.. ప్రభాస్ సరికొత్త రికార్డ్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ సలార్(Salar). కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth neel) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఇక తాజాగా రిలీజైన సలార్ టీజర్ కు ఆడియన్స్ నుండి భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. అందుకే ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రభాస్ ఫ్యాన్స్ తో పేరు ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

ఇక తాజాగా ఈ సినిమా నుండి వినిపిస్తున్న న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే సలార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 28న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. అయితే అమేరికాలో సలార్ సినిమా ప్రీమియర్స్.. రిలీజ్ కంటే ఒకరోజు ముందే అంటే సెప్టెంబర్ 27న పడనున్నాయి. అది కూడా 1979 ప్లేసెస్ లో. ఒక ఇండియన్ సినిమా అమెరికాలో ఈ రేంజ్ లో రిలీజ్ అవడం అనేది ఇదే మొదటిసారి. ఈ రేర్ ఫీట్ సాధించిన మొదటి హీరోగా ప్రభాస్ రికార్డ్ క్రియేట్ చేశారు. 

ALSO READ :పెళ్లి చేసుకోబోతున్న కేథరిన్.. వరుడు ఎవరో తెలుసా?

అంతేకాదు.. ఇండియా కాకుండా ప్రపంచవ్యాప్తంగా సలార్ సినిమా దాదాపు 5000 థియేటర్స్ లో రిలీజ్ కానుందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఒక వేళ ఈవార్త గనక నిజమైతే.. సలార్ మొదటిరోజు రికార్డ్ కలెక్షన్స్ రాబట్టడం ఖాయం. దీంతో ఇండియాన్ బాక్సాఫీస్ షేక్ అవడం కుడా ఖాయం. ఈ న్యూస్ తెల్సుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.