44 పశువుల పట్టివేత.. డీసీఎంలో అక్రమంగా తరలింపు.. 8 మందిపై కేసు..ములుగు జిల్లాలో ఘటన

 44 పశువుల పట్టివేత..  డీసీఎంలో అక్రమంగా తరలింపు..  8 మందిపై కేసు..ములుగు జిల్లాలో ఘటన

ములుగు, వెలుగు :  డీసీఎంల్లో పశువులను తరలిస్తుండగా ములుగు జిల్లా పోలీసులు పట్టుకుని  కేసు నమోదు చేశారు. జంగాలపల్లి క్రాస్​రోడ్డు వద్ద ఎస్ఐ సీహెచ్ వెంకటేశ్వర్ రావు ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు.  2  డీసీఎంలు (36 టీ 4564,  టీజీ12 టీ 2214 ) రాగా.. వాటిని ఆపి  సోదాలు చేశారు. పర్మిషన్ లేకుండా పశువులను తరలిస్తున్నట్లు గుర్తించారు. అందులోని 44 ఆవులు, ఎద్దులను స్వాధీనం చేసుకుని 8 మందిపై  కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. పశువులను గోశాలకు తరలించారు. అనుమతి లేకుండా తరలిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.