కోర్టుకు జగన్ హాజరు కావల్సిందే: సీబీఐ

కోర్టుకు జగన్ హాజరు కావల్సిందే: సీబీఐ

అక్రమ ఆస్తుల కేసులో వ్యక్తిగత హాజరునుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ నాంపల్లి కోర్టులో ఏపీ సీఎం జగన్ దాఖలు చేసిన పిటీషన్ పై కౌంటర్ దాఖలు చేసింది సీబీఐ. వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇస్తే సాక్షులను జగన్ ప్రభావితం చేసే అవకాశం ఉందని కౌంటర్ లో సీబీఐ పేర్కొంది. జగన్ జైళులో ఉన్నప్పుడే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందన్నది సీబీఐ. అయితే ఏపీలో రెవెన్యూ అంశాలను చెప్పి వాస్తవాలను పక్కదారి పట్టించేందుకు చూస్తున్నారని తెలిపింది. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న జగన్‌ సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందన్న సీబీఐ… ఏపీ లో రెవెన్యూ లోటనేది వ్యక్తిగత హాజరు మినహాయింపునిచ్చే కారణం కాదని సీబీఐ తెలిపింది. విజయవాడ నుంచి వారానికోసారి రావడం కష్టం కాదని కౌంటర్ లో పేర్కొంది సీబీఐ. కౌంటర్ పై శుక్రవారం వాదనలు విననుంది కోర్టు.