
హైదరాబాద్, వెలుగు: రిటైర్డ్ అధికారి వద్ద లంచం తీసుకుంటూ జీఎస్టీ సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ సీబీఐకి చిక్కాడు. ఏరియర్స్ పే పారిటీ బిల్స్ క్లియర్ చేసేందుకు రిటైర్డ్ అసిస్టెంట్‌కమిషనర్ వద్ద రూ.25 వేలు లంచం తీసుకున్న అకౌంట్స్ ఆఫీసర్ ప్రకాశ్‌ను సీబీఐ అధికారులు మంగళవారం అరెస్ట్ చేశారు. నాంపల్లిలోని స్పెషల్ కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేసిన విజయ్‌కుమార్ ఇటీవల రిటైర్ అయ్యారు.
రూ.14.45 లక్షలు రిటైర్డ్ బెన్‌ఫిట్స్ కోసం హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని జీఎస్టీ కమిషనర్ కార్యాయంలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ బిల్స్‌ను క్లియర్ చేసేందుకు సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ డీ ప్రకాశ్‌రావు రూ.30 వేలు డిమాండ్ చేశాడు. ఇందుకు ఆగస్ట్18 నుంచి 25 వ తేదీ మధ్య ప్రకాశ్‌రావుకు పలుమార్లు ఫోన్ కాల్స్ చేశాడు. ఆఖరికి రూ.25 వేలకు అంగీకరించాడు. బాధితుఢి ఫిర్యాదుతో సీబీఐ హైదరాబాద్ రీజినల్ అధికారులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
డీఎస్‌పీఈ యాక్ట్ సెక్షన్6 కింద రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకున్నారు. ఆమోదం లభించగానే అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రకాశ్‌రావు ఫోన్ కాల్ డేటాతోపాటు బాధితుడు అందించిన వివరాల ఆధారంగా విచారణ జరిపారు. రూ.25 వేలు లంచం తీసుకున్నట్టు తేలడంతో ప్రకాశ్ రావును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.