V6 News

సీబీఐ కోర్టులో జగన్ కు రిలీఫ్... ఫ్యామిలీతో విదేశీ పర్యటనకు గ్రీన్ సిగ్నల్...

సీబీఐ కోర్టులో జగన్ కు రిలీఫ్... ఫ్యామిలీతో విదేశీ పర్యటనకు గ్రీన్ సిగ్నల్...

ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ కు సీబీఐ కోర్టులో ఊరట లభించింది. కుటుంబసభ్యులతో కలిసి విదేశీ పర్యటనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సీబీఐ కోర్టు. ఫ్యామిలీతో కలిసి యూకే, యూరోప్ వెళ్లేందుకు అనుమతి కోరుతూ జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై శుక్రవారం ( ఏప్రిల్ 17 ) విచారణ జరిపిన కోర్టు.. అనుకూలంగా స్పందించింది. ఏప్రిల్ 20 నుండి వచ్చే నెల 15 వరకు 25 రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతించింది సీబీఐ కోర్టు.

దేశం విడిచి వెళ్లే ముందు కాంటాక్ట్ నెంబర్ , ఈమెయిల్ ఐడీ, ష్యురిటీ సీబీఐ అధికారులకు అందజేయాలని ఆదేశించింది కోర్టు. అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న జగన్ దేశం విడిచి వెళ్లాలంటే సీబీఐ కోర్టు అనుమతి తప్పనిసరి. ఈ క్రమంలో గతంలో కూడా పలు మార్లు సీబీఐ కోర్టు అనుమతితో విదేశీ పర్యటనకు వెళ్లారు జగన్.