లిక్కర్ స్కాం : కాసేపట్లో అభిషేక్ బెయిల్ పిటిషన్పై విచారణ

లిక్కర్ స్కాం : కాసేపట్లో అభిషేక్ బెయిల్ పిటిషన్పై విచారణ

ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టైన అభిషేక్ బోయినపల్లి బెయిల్ పిటిషన్పై రౌస్ అవెన్యూ సీబీఐ స్పెషల్ కోర్టు ఇవాళ విచారణ జరపనుంది. బెయిల్కు సంబంధించి నవంబర్ 4న ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను ఇవాళ చేపట్టనున్నారు. నిందితుడు పలుకుబడి కలిగిన వ్యక్తి అయినందున బయటకు వస్తే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశముందని సీబీఐ తరఫు న్యాయవాది వాదించారు. అందుకే అభిషేక్ బెయిల్ పిటిషన్ కొట్టివేయాలని న్యాయమూర్తిని కోరారు. సమీర్ మహేంద్రులో ఎలాంటి నగదు లావాదేవీలులేవని అభిషేక్ తరఫున న్యాయవాది కోర్టుకు చెప్పారు. ఇరువైపులా వాదనల అనంతరం సీబీఐ కోర్టు తదుపరి విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది.

ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనలో కొన్ని కంపెనీలకు లబ్ది చేకూరేలా రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్పీ వ్యవహరించిందని సీబీఐ ఆరోపించింది. అరెస్ట్ వ్యవహారం తెలంగాణ 
మద్యం విధాన రూపకల్పనలో కొన్ని కంపెనీలకు లబ్ధి చేకూరేలా రాబిన్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఎల్‌ఎల్‌పీ వ్యవహరించిందని సీబీఐ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో కంపెనీ డైరెక్టర్ అభిషేక్ బోయినపల్లిని అక్టోబర్10న అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించారు. అప్పటి నుంచి అభిషేక్ తీహార్ జైలులో ఉన్నారు.