
హైదరాబాద్: సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో, ఆయనను జూబ్లీహిల్స్లోని అపోలో ఆసుప్రతికి తరలించారు. ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. అయితే, శ్రీశైలం దర్శనం కోసం వెళ్లిన ఆయన ఇవాళ ఉదయం హైదరాబాద్కు తిరిగి వస్తుండగా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది.. ఆయన్ను జూబ్లీహిల్స్లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన పోలీసు ఉన్నతాధికారులంతా ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. వైద్య సిబ్బందితో మాట్లాడి ఆరోగ్య వివరాలు తెలుసుకున్నా రు.
నిన్న (శుక్రవారం) నగరానికి చేరుకున్న ఆయన హైదరాబాద్ జోన్ సీబీఐ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. రెండు గంటలకు పైగా సుదీర్ఘంగా చర్చించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 1న కేంద్రానికి అధికారికంగా లేఖ రాసింది. ఈ పరిణామం జరిగిన వెంటనే సీబీఐ డైరెక్టర్ స్వయంగా హైదరాబాద్కు రావడం హాట్ టాపిక్గా మారింది.