ఖలిస్తానీలకు కెనడా ఫండ్స్.. అప్పట్లో ఇండియా చెబితే నమ్మలే.. సంచన రిపోర్ట్..

ఖలిస్తానీలకు కెనడా ఫండ్స్.. అప్పట్లో ఇండియా చెబితే నమ్మలే.. సంచన రిపోర్ట్..

ఖలిస్తానీ ఉగ్రవాదులతో సంబంధాలు కలిగిన కొన్ని గ్రూప్స్ ఇప్పటికీ కెనడా నుంచి ఆర్థిక సహాయం పొందుతున్నాయని స్వయంగా కెనడా ప్రభుత్వం అధికారికంగా అంగీకరించటం సంచలనంగా మారింది. 2025లో విడుదల చేసిన "2025 Assessment of Money Laundering and Terrorist Financing Risks in Canada" అనే నివేదికలో ఈ వివరాలను పంచుకుంది కెనడా.  బబర్ ఖాల్సా ఇంటర్నేషనల్, ఇంటర్నేషనల్ సిక్ యువ ఫెడరేషన్ సంస్థలకు కెనడా నుంచే ఫండింగ్ జరుగుతోందని రిపోర్టులో కెనడా పేర్కొంది.

ఖలిస్తానీ ఉగ్రవాద గ్రూపులు భారత్ లోని పంజాబ్ రాష్ట్రంలో స్వతంత్ర ఖలిస్తాన్ రాష్ట్రాన్ని స్థాపించేందుకు హింసాత్మక మార్గాలను తమ వ్యూహంగా ఎంచుకున్నట్లు నివేదిక వెల్లడించింది. ఇది "పోలిటికల్ మోటివేటెడ్ వైలెంట్ ఎక్స్‌ట్రీమిజం" అనే విభాగం కిందకు వస్తుంది. అయితే తమ లక్ష్యాలను చేరుకునేందుకు ఈ సంస్థలు హింసను ప్రోత్సహించే మార్గాలను ఫాలో అవుతున్నట్లు రిపోర్ట్ పేర్కొంది. ఖలిస్తానీ గ్రూపులు హమాస్, హెజ్బోల్లా వంటి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో కలిసి కెనడాలో నిధులు సేకరించడంలో యాక్టివ్ గా ఉన్నట్లు వెల్లడైంది. ఈ సంస్థలు పంజాబీలు, చారిటీ సంస్థల ద్వారా నిధులు సమీకరిస్తున్నాయని కెనడా ప్రభుత్వం గుర్తించింది. 

హమాస్, హెజ్బోల్లా వంటి ఉగ్ర సంస్థలు నిధుల కోసం క్రిప్టోకరెన్సీ, పేరుపొందిన చారిటీ సంస్థలు, బ్యాంకింగ్ వ్యవస్థలో దోపిడీలు, మోసాలతో పాటు మాదక ద్రవ్యాలు వంటి మార్గాలను వినియోగిస్తున్నాయని నివేదిక వెల్లడించింది. కెనడా ఆర్థిక వ్యవస్థలోని కొన్ని నేరాలు కూడా ఇందులో భాగంగా ఉండే ప్రమాదం ఉందని రిపోర్ట్ వెల్లడించింది. 

►ALSO READ | వెనిజులాకు ట్రంప్ వార్నింగ్: US దళాల జోలికొస్తే యుద్ధ విమానాలు కూల్చేస్తామంటూ హెచ్చరిక..

గతంలో కెనడా తన భూభాగంలో ఖలిస్తానీ కార్యకలాపాలకు నిర్లక్ష్యం చేస్తుందని భారత ప్రభుత్వం తరచూ ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చినప్పటికీ దానిపై ఎక్కువగా కెనడా నేతలు ఫోకస్ పెట్టలేదని తెలుస్తోంది. కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ కూడా ఈ ఉగ్రవాద కార్యకలాపాలను గుర్తించింది. 2025లో ఈ ఖలిస్తానీ గ్రూప్స్ కెనడా నుంచి హింసాత్మక చర్యలకు ప్రోత్సాహించటంతో పాటు నిధుల సేకరణ చేస్తాయని తెలిపింది. తాజా నివేదిక కెనడాలో ఖలిస్తాని ఉగ్రవాదం ఇంకా పూర్తిగా అంతం కాలేదని సుస్పష్టం చేస్తోంది. దీని వల్ల కెనడా భద్రతా వ్యవస్థపై, భారత్-కెనడా సంబంధాలపై తీవ్ర ప్రభావం ఉండే అవకాశం ఉంది.