
ఆంధ్ర ప్రదేశ్ విశాఖ పట్నం లోక్ సభ స్థానం నుంచి పోటీచేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మూడో స్థానానికి పరిమితమయ్యారు. జనసేన తరపున పోటీ చేసిన ఆయనకు సిటీ ప్రజలు ఆదరించారు. అయితే గ్రామస్థాయి ఓటర్లలో జనసేనకు క్యాడర్ లేకపోయే సరికి గెలుపు దక్కలేదు. దీంతో ఆయనకు మూడో స్థానం దక్కింది. ఈ స్థానంలో వైసీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ 4,414 ఓట్లతో టీడీపీ క్యాండిడేట్ పై భరత్ పై విజయం సాధించారు.
దేశ వ్యాప్తంగా మోడీ ప్రభంజనం కనిపించినా.. ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం బీజేపీకి ఒక్క సీటు గెలువలేదు. విశాఖ లోక్ సభ స్థానం లో బీజేపీ నుంచి పోటీ చేసిన పూరందేశ్వరికి డిపాజిట్ కూడా దక్కలేదు.