లిక్కర్ కేసులో కవితనే కీలక సూత్రధారి : సీబీఐ

 లిక్కర్ కేసులో కవితనే కీలక సూత్రధారి  :  సీబీఐ

లిక్కర్ కేసులో  కవితను ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరింది సీబీఐ. ఇవాళ ఢిల్లీలోని రౌస్ అనెన్యూలోని ట్రయల్ కోర్టులో కవితను హాజరు పరిచారు సీబీఐ అధికారులు. లిక్కర్ కేసులో కవితనే కీలక పాత్రధారి అని తెలిపారు. విజయ్ నాయర్, మరికొందరితో కలిసి స్కెచ్ వేశారని వివరించారు. ఢిల్లీ, హైదరాబాద్ లో సమావేశాలు జరిగాయన్నారు సీబీఐ అధికారులు. ఆడిటర్ బుచ్చిబాబు వాంగ్మూలం ప్రకారం లిక్కర్ కేసులో కవిత పాత్ర స్పష్టమవుతోందన్నారు. 100 కోట్లు  సౌత్ గ్రూప్ నుంచి సమీకరించి ఆప్ నేతలకు అందించినట్లు కోర్టుకు తెలిపారు. 

కవిత పీఏ కౌశిక్ వాంగ్మూలం ప్రకారం అభిషేక్ బోయినపల్లి సూచన మేరుకు భారీ మొత్తంలో డబ్బు ఆప్ నేతలకు అందినట్లు వివరించారు సీబీఐ అధికారులు. ఆడిటర్ బుచ్చిబాబు స్టేట్మెంట్ ప్రకారం కవితకు ఇండో స్పిరిట్స్ సంస్థలో 33 శాతం వాటా ఉందన్నారు. ఇవన్నీ ఇప్పటికే దాఖలు చేసిన చార్జిషీట్ లో ఉన్నాయని, వీటి ఆధారాలు కూడా జతపరిచామన్నారు. 

శరత్ చంద్రా రెడ్డికి కేటాయించిన 5 జోన్లకు ప్రతిఫలంగా జోన్ కి 5కోట్ల చొప్పున మొత్తం 25 కోట్లు ఇవ్వాలని కవిత డిమాండ్ చేసినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. శరత్ చంద్రారెడ్డి ఒప్పుకోకపోవడంతో అతడిని కవిత బెదిరించారన్నారు. జైల్లో విచారణకు కవిత సహకరించలేదని కోర్టుకు వివరించారు.