రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ హీరోయిన్స్. జనవరి 13న సినిమా విడుదల కానుంది. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
అతిథులుగా హాజరైన దర్శకులు హరీష్ శంకర్, బాబీ, శివ నిర్వాణ ఈ సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు. రవితేజ మాట్లాడుతూ ‘చాలా అద్భుతమైన టీమ్‌తో వర్క్ చేశా. ఇదొక ఫన్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్. ఇందులో సునీల్‌తో మళ్ళీ ‘దుబాయ్ శీను’ లాంటి ఫన్ చూడబోతున్నారు. ఆడియెన్స్ విపరీతంగా ఎంజాయ్ చేస్తారు’ అని చెప్పారు.
కిషోర్ తిరుమల మాట్లాడుతూ ‘ఈ సినిమా చాలా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేశాం. ప్రతి యాక్టర్ అద్భుతంగా నటించారు. అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది’ అని చెప్పాడు. రవితేజతో వర్క్ చేయడం వెరీ గుడ్ ఎక్స్‌పీరియెన్స్ అని హీరోయిన్స్ డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ అన్నారు. ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి మాట్లాడుతూ ‘సంక్రాంతికి మా బీఎండబ్ల్యూ(భర్త మహాశయులకు విజ్ఞప్తి) రైడ్‌కి వెళితే కచ్చింగా ఎంజాయ్ చేస్తారు’ అని చెప్పారు. మూవీ టీమ్ అంతా పాల్గొన్నారు.
రవితేజ ఫెయిల్యూర్స్:
మాస్ మహారాజ రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. కానీ, అంతేస్థాయిలో వరుస ఫెయిల్యూర్స్ అందుకుంటున్నారు. ఇటీవలే మాస్ జాతరతో వచ్చిన రవితేజ, ప్రేక్షకుల్ని ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాడు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే ఉద్దేశ్యంతో.. తనకి అచ్చొచ్చిన కామెడీ ఎంటర్ టైనర్తో ఆడియన్స్ని పలకరించనున్నాడు. అందుకు తగ్గ కథను డైరెక్టర్ కిషోర్ తిరుమల దగ్గర పట్టేసి, ఈ సారి హిట్ కొట్టబోతునట్లుగా సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
రవితేజ మార్క్ కామిక్ టైమింగ్, మాస్ అప్పీల్‌తో కూడిన ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ డ్రామాగా దర్శకుడు కిషోర్ తిరుమల రూపొందించినట్టుగా ట్రైలర్ బట్టి తెలుస్తోంది. ఇందులో లేటెస్ట్ సోషల్ మీడియా సెన్సేషనల్ హీరోయిన్లు ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి రవితేజకి జోడీగా నటిస్తున్నారు. వీరితో రవితేజ చేసిన ఫన్, రొమాంటిక్ విజువల్స్ ఫ్రెష్ ఫీలింగ్ ఇచ్చేలా ఉన్నాయి. ఇక ఈ సినిమాతో అయిన, రవితేజ హిట్ కొడుతాడో లేదో చూడాలి. ఇకపోతే, ఇది రవితేజ కెరీర్‌లో 76వ చిత్రం.
