- సికింద్రాబాద్ ఇన్చార్జి అదం సంతోష్ కుమార్
పద్మారావునగర్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తోన్న సంక్షేమ పథకాలే కాంగ్రెస్‌కు బలమని ఆ పార్టీ సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి అదం సంతోష్‌కుమార్ అన్నారు. మెట్టుగూడ డివిజన్లో ఆదివారం పార్టీ ఆధ్వర్యంలో మహా పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రజలకు అందుతున్నాయని, గత ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఈ పాదయాత్రలో రాజేందర్ యాదవ్, శిల్పాచారి, రాజేందర్ యాదవ్, బెన్న, శ్రీను రెడ్డి, జయరాజ్ తదితరులు పాల్గొన్నారు.
