పంజాగుట్ట, వెలుగు: సీనియర్ పాత్రికేయులు లక్ష్మణ్రావు మానవీయ కథనాలకు ఆద్యుడని, పత్రికారంగంలో ఆయన సేవలు చిరస్మరణీయమని సీనియర్ ఎడిటర్ కె.శ్రీనివాస్ కొనియాడారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు. పత్రిక రంగానికి తొలిపొద్దులా మారి గ్రామీణ జర్నలిస్టులను లక్ష్మణ్రావు ఆదుకున్నారని గుర్తు చేశారు. సీనియర్ జర్నలిస్టులు పాశం యాదగిరి, సతీశ్‌చందర్, వసంతలక్ష్మి, శివాజీ, ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
