అంతర్జాతీయంగా ట్రంప్ చేస్తున్న పనులతో ఒకపక్క స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోతుంటే.. మరోపక్క ఇన్వెస్టర్లు సేఫ్ పెట్టుబడుల్లోకి డబ్బును కుమ్మరిస్తున్నారు. దీంతో సంక్రాంతి పండుగ నాటికి కొంత తగ్గుతాయనుకుంటున్న గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు అస్సలు తగ్గేదే లే అన్నట్లుగా పెరుగుతూ పోతున్నాయి. బంగారం కంటే వెండి మరీ ఎక్కువగా పెరగటం మధ్యతరగతి భారతీయులకు షాపింగ్ ఆశలను ఆవిరి చేస్తోంది. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు షాపింగ్ చేయాలనుకుంటే ముందుగా తమ నగరాల్లో రేట్లను గమనించండి.
తెలుగు రాష్ట్రాల్లో జనవరి 12న బంగారం రేట్లు పెరుగుదలను నమోదు చేశాయి. దీంతో జనవరి 10 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.169 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.14వేల 215గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 030గా తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో భగ్గుమంటున్నాయి.
ఇక వెండి విషయానికి వస్తే భారీ ర్యాలీని తిరిగి స్టార్ట్ చేసింది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు కొనసాగటంతో సిల్వర్ ర్యాలీకి అడ్డుకట్ట లేకుండా కొనసాగుతోందని నిపుణులు అంటున్నారు. అయితే సోమవారం జనవరి 12, 2025న వెండి రేటు కేజీకి రూ.10వేలు పెరిగి కొనుగోలుదారులను షాక్ చేసింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రూ.2లక్షల 87వేలుగా ఉంది. అంటే గ్రాము ధర రూ.287 వద్ద ఉంది.
