న్యూఢిల్లీ: యూరోపియన్ యూనియన్ (ఈయూ)లోని స్పెయిన్, జర్మనీ, బెల్జియం, పోలాండ్ దేశాలకు భారత ఎగుమతులు పెరుగుతున్నాయని, ఈ దేశాలు కీలకమైన మార్కెట్లుగా మారుతున్నాయని కామర్స్ మినిస్ట్రీ పేర్కొంది.
స్పెయిన్‌కు భారత ఎగుమతులు ఏప్రిల్–నవంబర్ 2025లో 56శాతం పెరిగి 4.7 బిలియన్ డాలర్లకు చేరాయి. గతేడాది ఇదే టైమ్‌లో జరిగిన 3 బిలియన్ డాలర్లతో పోలిస్తే పెరిగాయి. మొత్తం ఎగుమతుల్లో ఈ దేశ వాటా 2.4 శాతానికి చేరుకుంది. జర్మనీకి ఎగుమతులు 9.3శాతం పెరిగి 7.5 బిలియన్ డాలర్లకు చేరగా, బెల్జియంకి ఎగుమతులు 4.2 బిలియన్ డాలర్ల నుంచి 4.4 బిలియన్ డాలర్లకి చేరాయి. పోలాండ్‌కు ఎగుమతులు 7.6శాతం పెరిగి 1.82 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఈయూతో ఇండియా బైలేటరల్ ట్రేడ్ విలువ 2024–25లో 136 బిలియన్ డాలర్లుగా ఉంది.
