బషీర్‌బాగ్, వెలుగు: నారాయణగూడ మెట్రో స్టేషన్ సమీపంలో ఎస్టీఎఫ్ డీ టీం పోలీసులు దాడులు నిర్వహించి 2.6 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సుల్తాన్ బజార్ నుంచి నారాయణగూడ రోడ్డుపై తనిఖీలు చేపట్టిన సమయంలో టైమ్ ఇన్‌స్టిట్యూట్ ఎదుట షేక్ ముసాఫర్ అనుమానాస్పదంగా కనిపించడంతో తనిఖీ చేశారు. 2.6 కేజీల గంజాయి, ఒక బైక్, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
