జీఎస్టీ సీనియర్ ఆఫీసర్ బొల్లినేని శ్రీనివాస్ గాంధీ ఇళ్లపై సీబీఐ దాడులు

జీఎస్టీ సీనియర్ ఆఫీసర్ బొల్లినేని శ్రీనివాస్ గాంధీ ఇళ్లపై సీబీఐ దాడులు

ఆదాయానికి మంచి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో జీఎస్టీ సీనియర్ ఆఫీసర్ బొల్లినేని శ్రీనివాస్ గాంధీ ఇళ్లపై సీబీఐ దాడులు చేసింది. మంగళవారం హైదరాబాద్‌‌‌‌లోని శ్రీనివాస్ ఆఫీసులతోపాటు విజయ వాడలోని ఆయన ఇళ్లు, బంధువుల ఇళ్లలో సోదాలు చేసింది. కూకట్ పల్లిలోని వసంత్ నగర్ లో శ్రీనివాస్ ఇంట్లో రూ. 2 కోట్ల నగదు, డాక్యు మెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అధికా రాన్ని అడ్డుపెట్టు కుని శ్రీనివాస్ కోట్లు సంపాదించా రని ప్రాథమిక ఆధారా లను సీబీఐ సేకరించింది. ఆయనతో పాటు భార్య శిరీషపై కేసులు పెట్టింది. హైదరాబాద్, గుంటూరు, విజయవా డలో శ్రీనివాస్​కు భారీగా ఆస్తులు ఉన్నట్లు సోదాల్లో గుర్తించినట్లు తెలిసింది. రంగారెడ్డి జిల్లా కొండాపూర్‌‌‌‌ లో 300 గజాల స్థలం, మదీనాగూడలో పది కుంటల భూమి, ఏపీలో ఐదు ప్రాంతాల్లో ఆస్తులు గుర్తించినట్లు తెలిసింది.