
పాలమూరు, వెలుగు: మహబూబ్ నగర్‌ను విద్యాహబ్ గా తీర్చిదిద్దనున్నట్లు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహబూబ్‌నగర్‌కు ట్రిపుల్ ఐటీని తీసుకురావడంలో సఫలీకృతమైనట్లు తెలిపారు. ఇటీవలే సీఎంతో జరిగిన సమావేశంలో బాసర తరహా ట్రిపుల్ ఐటీని ఏర్పాటు చేయడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిపారు. ట్రిపుల్ ఐటీని మహబూబ్ నగర్ కు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. 40 ఎకరాల్లో ఈ విద్యాసంస్థ ఏర్పాటు అవుతుందన్నారు.
ఇంటర్ స్టేట్ టెర్మినల్ ఏర్పాటు..
కర్నాటక రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి మహబూబ్‌నగర్ మీదుగా శ్రీశైలం క్షేత్రానికి బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో కొన్ని వేల మంది వెళుతుంటారని, ఇక్కడ ఇంటర్ స్టేట్ టెర్మినల్ ఏర్పాటు కోసం సీఎంకు విన్నవించినట్లు తెలిపారు. పట్టణానికి సమీపంలో ఇంటర్ స్టేట్ టెర్మినల్ ఏర్పాటు చేస్తామని అన్నారు.
.