కల్వకుర్తి మున్సిపాలిటీ లో కాంగ్రెస్ లో చేరిన ఇండిపెండెంట్

కల్వకుర్తి మున్సిపాలిటీ లో కాంగ్రెస్ లో చేరిన ఇండిపెండెంట్

కల్వకుర్తి, వెలుగు : కల్వకుర్తి మున్సిపాలిటీ 8వ వార్డు నుంచి కోడెల లలిత గణేశ్​యాదవ్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి అప్పటికే 13 మంది గెలిచారు. కాగా, ఆదివారం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సమక్షంలో ఇండిపెండెంట్ అభ్యర్థి లలిత కాంగ్రెస్ పార్టీలో చేరారు.

దీంతో కాంగ్రెస్ పార్టీకి మొత్తం 14 మంది కౌన్సిలర్లు అయ్యారు. కార్యక్రమంలో నాయకులు ఆనంద్ కుమార్, భూపతిరెడ్డి, సంజీవ్ యాదవ్, ముట్ట వెంకటయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.