ఒక్కటైన కాంగ్రెస్, బీజేపీ!... ఆమనగల్లో తిరగబడిన రాజకీయం

ఒక్కటైన కాంగ్రెస్, బీజేపీ!... ఆమనగల్లో తిరగబడిన రాజకీయం
  • కాంగ్రెస్​కు చైర్​ పర్సన్, బీజేపీకి వైస్ చైర్​ పర్సన్​​

నాగర్​ కర్నూల్, వెలుగు :  కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమనగల్​ మున్సిపల్​ చైర్మన్​ ఎన్నిక రసకందాయంలో పడింది. 8 వార్డులు గెలిచిన బీఆర్​ఎస్​కు చెక్​ పెట్టేందుకు కాంగ్రెస్​, బీజేపీ ఒక్కటయ్యాయి. ఒక్క వార్డు గెలిచిన కాంగ్రెస్​కు చైర్మన్​ పదవి ఇస్తామని బీజేపీ నాయకులు ఇచ్చిన ఆఫర్​కు ఓకే చెప్పిన కాంగ్రెస్​ నాయకులు ఆమనగల్​ మున్సిపాలిటీలో కలిసి నడిచేందుకు సిద్దమయ్యారు. ఆమనగల్​మున్సిపాలిటీలో   15 వార్డులు ఉండగా, బీఆర్​ఎస్​8 వార్డులు, బీజేపీ 5 వార్డులు, కాంగ్రెస్​ ఒక వార్డులో విజయం సాధించాయి.

బీఆర్ఎస్​ అభ్యర్థి చైర్​ పర్సన్​ సీటుపై కుర్చుంటారనే భావించారు. బీఆర్​ఎస్​కు చెందిన ఒక నాయకుడు వరుస వీడియో మెసేజులతో పాటు కల్వకుర్తి మున్సిపాలిటీలో నలుగురు కాంగ్రెస్​ కౌన్సిలర్లను ప్రలోభ పెట్టినట్టు తెలియడంతో కాంగ్రెస్​ అలర్ట్​ అయ్యింది. ​కల్వకుర్తి మున్సిపాలిటీలోని తమ అభ్యర్థులను కట్టడిచేస్తూనే ఆమనగల్​లో బీఆర్​ఎస్​కు చెక్​ పెట్టారు.

బీజేపీకి చెందిన రాష్ట్రస్థాయి నాయకుడు  నాగర్​ కర్నూల్​ ఎంపీ డాక్టర్​మల్లు రవిని కలిసి చైర్​పర్సన్​ పోస్ట్​ ఆఫర్​ ఇచ్చారు. ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణ రెడ్డి, మల్లు రవి ఆదివారం ఆమనగల్​ మున్సిపాలిటీలో ఎక్స్​అఫిషీయో మెంబర్లుగా పేర్లు నమోదు చేసకున్నారు.  దీంతో ఆమన్​గల్​లో ఒక స్థానాన్ని గెలుచుకున్న కాంగ్రెస్​ కౌన్సిలర్​కు అదృష్టం కలిసి వచ్చినట్టయ్యింది.