ధాన్యం తరలించేందుకు ట్రాన్స్​పోర్ట్ ​ఇబ్బందులు ఉండొద్దు : మంత్రి పొన్నం ప్రభాకర్​

 ధాన్యం తరలించేందుకు ట్రాన్స్​పోర్ట్ ​ఇబ్బందులు ఉండొద్దు : మంత్రి పొన్నం ప్రభాకర్​

కోహెడ, వెలుగు: ధాన్యం తరలించేందుకు ట్రాన్స్​పోర్ట్​ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి పొన్నం ప్రభాకర్​అధికారులను ఆదేశించారు. రైతులకు ధాన్యం పేమెంట్​వెంటనే పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. శనివారం మండలంలోని శనిగరం ఐకేపీ సెంటర్ ను​కలెక్టర్ ​మనుచౌదరితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లడుతూ.. అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా టార్ఫాలిన్​కవర్లను అందించాలన్నారు. శనిగరం ప్రాజెక్టు కాల్వలో పూడిక తీయాలని ఇరిగేషన్​అధికారులకు సూచించారు. 

మహిళా సంఘాలు రైస్​మిల్లులు ఇవ్వాలని కోరుతున్నారని దానిపై పరిశీలన చేస్తున్నామన్నారు. వంటిమామిడి దగ్గర ఉన్న వెజిటబుల్​ మార్కెట్ మాదిరిగా​శనిగరం వద్ద చేపల మార్కెట్​ను ఏర్పాటు చేసి ఫిషరీస్​సంఘాలు ఇక్కడే చేపలు అమ్ముకునేలా చేస్తామన్నారు. మండలంలో రూ,180కోట్లతో నిర్మించే యంగ్​ఇండియా ఇంటిగ్రేటెడ్ ​రెసిడెన్షియల్​స్కూల్​కు టెండర్​ ప్రక్రియ పూర్తయిందని పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్​కలెక్టర్​హమీద్, డీపీఎం కరుణాకర్, డీఆర్డీవో జయదేవ్, ఆర్డీవో రామ్మూర్తి, ఏఎంసీ చైర్​పర్సన్​నిర్మల, వైస్​చైర్మన్​తిరుపతిరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు ధర్మయ్య, నాయకులు సుధాకర్, రవీందర్, శ్రీధర్, ప్రతాప్​రెడ్డి, అనిల్, వెంకటస్వామి ​పాల్గొన్నారు.

ఎల్లమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి

ఈ నెల12 నుంచి నెల రోజుల పాటు జరిగే  రేణుక ఎల్లమ్మ  ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని మంత్రి పొన్నం ప్రభాకర్​అధికారులను ఆదేశించారు. హుస్నాబాద్​లో ఎల్లమ్మ ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ ఎల్లమ్మ ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో వస్తారన్నారు. అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. జూబ్లీహిల్స్​పెద్దమ్మ, బల్కంపేట ఎల్లమ్మ ఆలయాల మాదిరి ఇక్కడ కూడా అభివృద్ధి చేస్తామన్నారు. త్వరలోనే ఆలయ కమిటీని నియమిస్తామని తెలిపారు. ఆయన వెంట జిల్లా లైబ్రరీ చైర్మన్​ లింగమూర్తి, ఆలయ ఈవో కిషన్​రావు, సింగిల్​విండో చైర్మన్​శివ్వయ్య, ఆర్డీవో రామ్మూర్తి ఉన్నారు.