డీకే శివకుమార్ ఇంట్లో సీబీఐ సోదాలు

డీకే శివకుమార్ ఇంట్లో సీబీఐ సోదాలు

కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఇంట్లో సీబీఐ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. బెంగళూరులోని డీకే శివకుమార్ ఇంటికి చేరుకున్న సీబీఐ అధికారులు తనిఖీలు ప్రారంభించారు. అలాగే శివకుమార్ సోదరుడు లోక్ సభ ఎంపీ డీకే సురేష్ ఇంట్లోకూడా సోదాలు జరుగుతున్నాయి. బెంగళూరులోని దొడ్డలహల్లి, కనకపుర, సదాశివ నగర్ లోని ఇళ్లతో పాటు.. మొత్తంగా 15 ప్రాంతాల్లో సీబీఐ అధికారులు సెర్చ్ చేస్తున్నారు.

అవినీతి కేసులో DK శివకుమార్ పై ఆరోపణలున్నాయి. మనీలాండరింగ్, ట్యాక్స్ ఎగవేతలకు సంబంధించి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టోరేట్ ఇచ్చిన సమాచారం ఆధారంగా కరప్షన్ కేసు నమోదు చేసింది సీబీఐ. ఈ వ్యవహారాల్లో ఇప్పటికే దర్యాప్తు చేసిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టోరేట్ తన దర్యాప్తులో గుర్తించిన కొన్ని విషయాలను సీబీఐకి షేర్ చేసింది. దాని ఆధారంగానే సీబీఐ దర్యాప్తు మొదలు పెట్టింది.

భారత్ లో 66 లక్షలు దాటిన కేసులు

తెలంగాణలో 2 లక్షలు దాటిన కేసులు