న్యూఢిల్లీ: బ్యాంక్ మోసం కేసులో జెట్ఎయిర్వేస్ ముంబై ఆఫీసుతో పాటు దీని ఫౌండర్ నరేశ్ గోయల్ ఇల్లు సహా ఏడు చోట్ల శుక్రవారం దాడులు చేశామని సీబీఐ ప్రకటించింది. గోయల్ కెనరా బ్యాంకును రూ.538 కోట్లకు మోసం చేసినట్టు కేసు నమోదయింది. విచారణలో భాగంగా గోయల్, ఆయన భార్య అనిత ఆఫీసుల్లో, జెట్ మాజీ డైరెక్టర్ గౌరంగ్ ఆనంద్ శెట్టి ఇంట్లోనూ దాడులు జరిగాయి.
అప్పుల కారణంగా దివాలా తీసిన జెట్ ఎయిర్వేస్ 2019 ఏప్రిల్లో మూతబడింది. దీనిని జలాన్ కల్రాక్ కన్సార్షియం బిడ్ ద్వారా దక్కించుకుంది. యాజమాన్య బదిలీలో మాత్రం సమస్యలు వస్తున్నాయి. ఈ కన్సార్షియం గత సెప్టెంబరులోనే తిరిగి కార్యకలాపాలను మొదలుపెడతామని ప్రకటించింది. కానీ ఆలస్యం జరుగుతోంది.