విచారణకు రండి.. కవితకు సీబీఐ సమన్లు

విచారణకు రండి..  కవితకు సీబీఐ సమన్లు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు పంపించింది. 2024 ఫిబ్రవరి 26న విచారణకు రావాలని నోటీసులో పేర్కొంది.  గతంలో సీబీఐ హైదదాబాద్ లోని కవిత ఇంట వద్ద స్టేట్‌మెంట్‌ తీసుకుంది. కాగా ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు ఈడీ  కవితకు నోటీసులు పంపగా.. ఆమె హాజరు కాలేదు. మరి ఈ సారి సీబీఐ విచారణకైనా హాజరు అవుతారో లేదో చూడాలి.  


మరోవైపు లిక్కర్ కేసులో బీఆర్ఎస్ కవిత వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు ఫిబ్రవరి 28కి వాయిదా వేసింది. లిక్కర్ కేసుకు సంబంధించి తనకు ఈడీ జారీ చేసిన నోటీసులపై అభ్యంతరం తెలుపుతూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.  కవిత దాఖలు చేసిన పిటిషన్ ను ప్రత్యేకంగా విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.