
ఢిల్లీలో భారీ వరదల కారణంగా ముగ్గురు యూపీఎస్సీ అభ్యర్థులు నీట మునిగి చనిపోయిన విషయం తెలిసిందే. ఈ కేసును శుక్రవారం ఢిల్లీ హైకోర్టు సీబిఐకి బదిలీ చేసింది. ఓల్డ్ రాజేంద్రనగర్ రావుస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ బేస్‌మెంట్ గేట్ ద్వంసమై గ్రౌండ్ ఫ్లోర్ లోకి వాటర్ వచ్చాయి.
ముగ్గురు యూపీఎస్సీ అభ్యర్థుల చావుకు ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమే కారణమని తోటి విద్యార్థులు ఆదివారం ఆందోళనకు దిగారు. ఢిల్లీ పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. శుక్రవారం ఢిల్లీ హైకోర్టు UPSC అభ్యర్థుల మృతి కేసు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు అప్పగించింది.
ఇప్పుడు జరిగిన దాంట్లో ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి పాల్పడి ఉండొచ్చని, ముగ్గురు యూపీఎస్సీ అభ్యర్థులు చనిపోవడం అంటే మాములు విషయం కాదని ఈరోజు కోర్టు పేర్కొంది. సివిల్ సర్వీసెస్ అభ్యర్థుల మరణాలపై సీబీఐ విచారణను పర్యవేక్షించేందుకు సీనియర్ అధికారిని నామినేట్ చేయాలని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ)ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.