సీసీ కెమెరాకు చూపించి మరీ.. లంచం తీసుకుంది

సీసీ కెమెరాకు చూపించి మరీ.. లంచం తీసుకుంది

అధికారులు ఒకటికి రెండు సార్లు ఎవరూ చూడట్లేదని నిర్ణయించుకున్నాకే లంచాలు తీసుకుంటారు. కానీ శ్రీకాకుళం జిల్లాలో ఓ అధికారి మాత్రం సీసీ కెమెరాకు చూపించి మరీ లంచం తీసుకుంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. శ్రీకాకుళం జిల్లాలో కర్మాగారాలశాఖ తనిఖీ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్​గా పనిచేస్తున్న బి.కుసుమ కుమారి 18 సంవత్సరాలుగా పని చేస్తున్నారు. మొదటి నుంచి బాధ్యతారాహిత్యంగా పని చేస్తుందనే విమర్శలు ఉన్నాయి.

ఆమె పని తీరుపై విమర్శలు రావడంతో ఇటీవల అధికారులు సీసీ కెమెరాలు పెట్టించినట్లు తెలిసింది. ఇటీవల ఆమె భయపడకుండా సీసీ కెమెరాకు చూపించి మరీ లంచం తీసుకుంది. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్​ మీడియాలో చక్కెర్లు కొట్టడంతో విషయం తెలుసుకున్న అధికారులు ఆమెను సస్పెండ్ చేశారు. ఈ విసయాన్ని కర్మాగారాల శాఖ డైరెక్టర్ చంద్రశేఖర్ శర్మ ఆదివారం మీడియాకు తెలిపారు.