
IPLకు వరల్డ్ వైడ్ ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే మరో వారం రోజుల్లో ఈ సందడి ముగియనుంది. క్రికెట్ ఫ్యాన్స్ కు జోష్ తగ్గుతుందనుకుంటుండగా మరో ఐపీఎల్ రానుంది. అమ్మాయిల ఐపీఎల్ కు అంతా రెడీ అయ్యింది. ఇడియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ప్రస్తుతం జరుగుతున్న లీగ్ మ్యాచ్ ల తర్వాత ఉమెన్స్ క్రికెటర్లతో BCCI ఉమెన్స్ IPL నిర్వహించనుంది. గత ఏడాది కూడా ఫస్ట్ ప్లేఆఫ్స్ మ్యాచ్ కి ముందు స్మతి మందనా, హర్మన్ ప్రీత్ కౌర్ లు కెప్టెన్ లుగా సూపర్ నోవాస్, ట్రెయల్ బ్లేజర్స్ టీమ్స్ మధ్య ఓ IPL మ్యాచ్ ను నిర్వహించారు.
ఈ మ్యాచ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈసారి మ్యాచ్ లు, టీమ్స్ ను పెంచారు. గత ఏడాది ఆడిన సూపర్ నోవాస్, ట్రయల్ బ్లేజర్స్‌తో పాటు ఈ సారి వెలాసిటీ అనే మరో టీమ్ ను జత చేశాడరు. ఈ మూడు టీమ్స్ లో ఒక్కో టీమ్ మే 6వ తేదీ నుంచి 9వ తేదీ వరకూ మరో రెండు టీమ్స్ తో తలో మ్యాచ్ ఆడుతాయి. ఆ తర్వాత మే 11వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఈ లీగ్ లో భారత మహిళ క్రికెటర్లతో పాటు.. విదేశీ ప్లేయర్లు కూడా ఆడుతారని తెలిపింది BCCI.