
న్యూఢిల్లీ: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో, జియోమార్ట్, మెటా, చిమియా వంటి ఆన్‌లైన్ మార్కెట్ ప్లాట్‌ఫామ్స్ నిషేధిత వాకీ-టాకీ లిస్టింగ్స్‌ను తొలగించాయి. సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) ఇచ్చిన గైడ్‌లైన్స్ తర్వాత ఈ చర్యలు చేపట్టాయి. ఆన్‌లైన్‌లో రేడియో కమ్యూనికేషన్ డివైజ్‌లు, ముఖ్యంగా వాకీ-టాకీలను అమ్మొద్దని సీసీపీఏ ఆదేశాలు జారీ చేసింది. వీటి వలన ప్రజల భద్రత ప్రమాదంలో పడొచ్చని, వినియోగదారులు మోసపోవచ్చని పేర్కొంది. అంతేకాకుండా ఈ డివైజ్‌లు పోలీస్, ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉపయోగించే కమ్యూనికేషన్ సిస్టమ్స్‌కు అడ్డు కావొచ్చని వివరించింది.
పీఐబీ స్టేట్‌మెంట్ ప్రకారం, ఈ గైడ్‌లైన్స్‌ను డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్‌తో కలిసి తయారు చేసింది. రెగ్యులేటరీ, సెక్యూరిటీ సిఫార్సులను ఇందులో చేర్చారు. టాక్ ప్రో, మాక్‌మ్యాన్ టాయ్స్ లాంటి ప్లాట్‌ఫామ్స్ ఇంకా ఈ ప్రొడక్ట్స్‌ను తొలగించలేదని ఎన్‌డీటీవీ రిపోర్ట్ చేసింది. ఇండియామార్ట్‌లో కూడా అలాంటి లిస్టింగ్స్ ఉన్నాయని, ఓఎల్‌ఎక్స్, కృష్ణ మార్ట్, వర్దన్‌మార్ట్, ట్రేడ్‌ఇండియా లాంటివాళ్లకు నోటీసులు ఇచ్చినా, వాళ్ల నుంచి ఇంకా పబ్లిక్ రెస్పాన్స్ రాలేదని పేర్కొంది.
సీసీపీఏ గైడ్‌లైన్స్‌లో ముఖ్యమైన అంశాలు..
* అనుమతించిన ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్‌లో పనిచేసే వాకీ-టాకీలను మాత్రమే అమ్మాలి.
* ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ తమ ప్రొడక్ట్ లిస్టింగ్స్‌లో ఫ్రీక్వెన్సీ రేంజ్, టెక్నికల్ వివరాలు, రెగ్యులేటరీ అనుమతులకు చెందిన (ఎక్విప్‌మెంట్ టైప్ అప్రూవల్) డాక్యుమెంట్స్ క్లియర్‌గా చూపించాలి.
* ప్రొడక్ట్స్, సెల్లర్స్ లైసెన్సింగ్ రూల్స్‌ను ఫాలో అవుతున్నాయో లేదో చెక్ చేయాలి. రూల్స్ ఫాలో కాకపోతే వాటిని ప్లాట్‌ఫామ్ లిస్టింగ్స్ నుంచి ఈ–కామర్స్ కంపెనీలు తీసేయాలి.
* ప్రజలను తప్పుదోవ పట్టించే వివరాలు ఉండకూడదు. యాడ్స్ లేదా డిస్క్రిప్షన్స్‌లో అనధికార డివైజ్‌లను లీగల్‌గా వాడొచ్చని తప్పుగా ప్రచారం చేయకూడదు.
* అనుమంతించని ఫ్రీక్వెన్సీలపై డివైజ్ పనిచేయకూడదు. ఫ్రీక్వెన్సీ వివరాలు లిస్టింగ్‌లో క్లియర్‌గా కనిపించాలి.