కరోనా సోకిన వారిలో ఆరు కొత్త లక్షణాలివే!

కరోనా సోకిన వారిలో ఆరు కొత్త లక్షణాలివే!

వాషింగ్టన్: కరోనా వైరస్ సోకిన వారికి ప్రధానంగా జ్వరం, దగ్గు,  ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది వస్తుందని అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్సన్ (సీడీసీ) ఇదివరకే వెల్లడించింది. తాజాగా మరో ఆరు లక్షణాలను కూడా సీడీసీ కరోనా డిసీజ్ లిస్ట్​లో చేర్చింది.  కరోనా పేషెంట్లకు చలి, తరచూ చలి వల్ల వణుకు పుట్టడం, కండరాల నొప్పి, తలనొప్పి, గొంతు నొప్పి, రుచి లేదా వాసన కోల్పోవడం వంటి లక్షణాలను కూడా ప్రధాన సంకేతాలుగా చూడాలని పేర్కొంది. ముక్కు నుంచి నీరు కారడం అనేది చాలా అరుదుగా కన్పిస్తోందని, అందువల్ల దీనిని కచ్చితమైన కరోనా లక్షణంగా భావించరాదని తెలిపింది. వైరస్ సోకిన తర్వాత 2 నుంచి 14 రోజులలోపు ఈ లక్షణాలు కన్పించవచ్చని వివరించింది.

మరణాల్లో అమెరికానే టాప్ 

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 30 లక్షలు దాటాయి. అన్ని దేశాల్లో కలిపి 2 లక్షలకు పైగా పేషెంట్లు మరణించారు. అటు కేసులు, ఇటు మరణాల్లోనూ అమెరికా టాప్ లో ఉంది. యూఎస్ లో 9.60 లక్షల కేసులు నమోదు కాగా, మరణాలు 52 వేలు దాటాయి.

లండన్ స్టాక్ మార్కెట్లు పైపైకి..

బ్రిటన్ లో నెలరోజులుగా కొనసాగుతున్న లాక్ డౌన్ వల్ల కరోనా వైరస్ వ్యాప్తి కొంత తగ్గడం, ప్రధాని బోరిస్ జాన్సన్ కోలుకుని తిరిగి విధుల్లో చేరడంతో సోమవారం లండన్ స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి. నోవాసైట్ డయాగ్నోస్టిక్స్ కంపెనీకి యూకే గవర్నమెంట్ నుంచి కాంట్రాక్ట్ దక్కినట్లు వార్తలు రావడంతో ఆ కంపెనీ షేర్లు 12.8% పెరిగాయి.

బీజింగ్ లో స్కూళ్లు ప్రారంభం

చైనాలోని బీజింగ్, షాంఘై నగరాల్లో లాక్ డౌన్ ఎత్తివేయడంతో దాదాపు 3 నెలల తర్వాత స్కూళ్లు తిరిగి ప్రారంభమయ్యాయి. నార్వేలోనూ సోమవారం ప్రైమరీ స్కూళ్లను తిరిగి తెరిచారు. స్విట్జర్లాండ్ లో సెలూన్లు, ఇతర దుకాణాలు తెరిచారు.

కెనడాలో మరణాలు తగ్గుముఖం

కెనడాలో కరోనా వైరస్ మరణాలు తగ్గుముఖం పట్టాయని అధికారులు చెప్పారు. దేశంలో వరుసగా ఏడో రోజు మరణాల సంఖ్య 10 శాతం కంటే తక్కువగా నమోదైంది. అయినా ఐసోలేషన్ రూల్స్ మాత్రం కొనసాగుతాయని ప్రధాని జస్టిన్ ట్రూడో స్పష్టం చేశారు.

మైగ్రెంట్లను పంపేస్తున్న మెక్సికో 

మెక్సికో ప్రభుత్వం దేశంలోని మైగ్రెంట్ సెల్టర్లను ఖాళీ చేయించింది. వలస పౌరులలో చాలా మందిని వారి సొంతదేశాలకు తిరిగి పంపింది. దేశంలోని 65 సెంటర్లలో 3,759 మంది విదేశీయులు ఉండగా, మార్చి 21 నుంచి వారిని తిరిగి పంపేస్తున్నారు. దేశంలో 14 వేల కేసులు, 1351 మరణాలు నమోదయ్యాయి.

ఫోన్ ట్రాకింగ్ కు ఇజ్రాయెల్ కోర్టు నో

కరోనా విపత్తును పర్యవేక్షించేందుకు షిన్ బెట్ సెక్యూరిటీ సంస్థ ఫోన్లపై నిఘా పెట్టడాన్ని నిలిపేయాలని ఆ దేశ సుప్రీంకోర్టు  ఆదేశించింది. చట్టం చేస్తే తప్ప ఇలాంటి చర్యలు కొనసాగరాదని స్పష్టం చేసింది.

రష్యాలో 874 మంది సైనికులకు వైరస్..

రష్యన్ మిలటరీలో 874 మంది సైనికులకు కరోనా పాజిటివ్ వచ్చిందని ఆ దేశ రక్షణ శాఖ  వెల్లడించింది. వీరిలో 379 మందిని ఇండ్ల వద్దే ఐసోలేషన్ లో ఉంచామని, మిగతా వారిని హాస్పిటళ్లలో ఉంచి ట్రీట్ మెంట్ చేస్తున్నామంది. ఐదుగురి పరిస్థితి సీరియస్ గా ఉందంది. రష్యాలో మార్చి నుంచి ఎమర్జెన్సీ సర్వీసులు తప్పా మార్చి నుంచి మిగతావన్నీ మూసేశారు.

లాక్‌‌డౌన్ సడలిస్తున్న పలు దేశాలు

ఇటలీ, సౌత్ కొరియా, ఫ్రాన్స్, న్యూజిలాండ్ దేశాలు లాక్ డౌన్ ను సడలించేందుకు రెడీఅవుతున్నాయి. ఇటలీలో మే 4 నుంచి లాక్ డౌన్ ను సడలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఫ్యాక్టరీలు, బిల్డింగ్ సైట్ల పనులకు అనుమతి ఇవ్వనుంది. ఫ్యామిలీ విజిట్స్ ను పరిమితం చేయడం లాంటి జాగ్రత్తలూ తీసుకుంటోంది. ఫ్రాన్స్ లో  రెండు వారాలుగా మరణాలు పెరుగుతున్నా, అవి స్థిరంగా ఉన్నాయి. అందుకే లాక్ డౌన్ సడలించడంపై సర్కారు ఫోకస్ పెట్టింది. సౌత్ కొరియాలో పరిశుభ్రత, సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూనే మే మొదటి వారంలో స్కూళ్లను తిరిగి ఓపెన్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. న్యూజిలాండ్ లో సోమవారం ప్రభుత్వం లాక్ డౌన్ ను పాక్షికంగా సడలించింది. దేశంలో కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ లేదని, కరోనాపై విజయం సాధించామని ప్రధాని జసిండా ఆర్డర్న్ అన్నారు.

వైరస్‌ సోకిన వారిలో కొత్త లక్షణాలివే..

  • చలి పుట్టడం
  • వణుకు రావడం
  • తల నొప్పి
  • కండరాల నొప్పి
  • గొంతు నొప్పి
  • రుచి, వాసన కోల్పోవడం
  • ప్రభుత్వం చేతిలో