అదే మనకు అతిపెద్ద సవాల్.. చైనాతో బార్డర్ ఇష్యూపై సీడీఎస్

అదే మనకు అతిపెద్ద సవాల్.. చైనాతో బార్డర్ ఇష్యూపై సీడీఎస్

న్యూఢిల్లీ: చైనాతో ఉన్న సరిహద్దు సమస్య మన దేశానికి అతిపెద్ద భద్రత సవాల్ అని చీఫ్‌‌‌‌ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌‌‌‌ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహన్ అన్నారు. శుక్రవారం ఉత్తరప్రదేశ్‌‌‌‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 

‘‘చైనాతో సరిహద్దు సమస్యే మన దేశానికి ఉన్న అతిపెద్ద సవాల్. మనపై పాకిస్తాన్ చేస్తున్న పరోక్ష యుద్ధం రెండో సవాల్. భారత్‌‌‌‌లో తరచూ దాడులు చేసి, రక్తం పారించాలన్నదే పాక్ వ్యూహం. మన పొరుగు దేశాల సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్యలు మనకు మూడో సవాల్. వాటి ప్రభావం మనపైనా ఉంటుంది. 

ఇక, భవిష్యత్తులో భూమి, గాలి, నీళ్లలో మాత్రమే కాదు.. స్పేస్, సైబర్ టెక్నాలజీ పరంగానూ యుద్ధాలు జరుగుతాయి. వాటికి మనం సిద్ధంగా ఉండడమే సవాల్‌‌‌‌తో కూడుకున్నది. మన శత్రు దేశాలు రెండూ అణ్వాయుధాలతో సిద్ధంగా ఉన్నాయి. వాటిని ఎలా ఎదుర్కొంటామన్నదే ఐదో చాలెంజ్. భవిష్యత్తు యుద్ధాలపై టెక్నాలజీ, దాని ప్రభావం ఆరో సవాల్” అని జనరల్ అనిల్ చౌహన్ పేర్కొన్నారు.