ఆ రెండు కరోనా వ్యాక్సిన్లకు నార్మల్ డ్రగ్ పర్మిషన్

ఆ రెండు కరోనా వ్యాక్సిన్లకు నార్మల్ డ్రగ్ పర్మిషన్

దేశంలో అందుబాటులో ఉన్న కరోనా వ్యాక్సిన్లు కొవిషీల్డ్, కొవాగ్జిన్లకు పర్మిషన్లను అప్‌గ్రేడ్ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ తెలిపారు. ప్రస్తుతం ఎమర్జెన్సీ వినియోగానికి మాత్రమే అనుమతి ఉన్న ఈ రెండు వ్యాక్సిన్లకు నార్మల్ డ్రగ్ పర్మిషన్ ఇస్తూ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నిర్ణయం తీసుకుందని ఆయన వివరించారు. ఈ నార్మల్ డ్రగ్ పర్మిషన్ కేవలం పెద్దలకు (అడల్ట్ అంటే 18 ఏండ్లు పైబడిన వారికి) వేసే వ్యాక్సినేషన్ విషయంలో మాత్రమే వర్తిస్తుందని పేర్కొన్నారు. ఈ పర్మిషన్‌ ఇచ్చేందుకు కొన్ని కండిషన్లను పెట్టినట్లు మాండవీయ తెలిపారు.  ఆరు నెలలకోసారి టీకా సేప్టీ డేటాను ఆ కంపెనీలు ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.

మార్కెట్‌లోకి టీకాలు.. అయినా ఫ్రీ వ్యాక్సినేషన్ కొనసాగింపు

మరోవైపు ఇప్పటివరకు కేవలం పరిమితంగా ప్రభుత్వం అనుమతించి ప్రైవేటు వ్యాక్సిన్ సెంటర్లు, ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రాల్లో మాత్రమే లభిస్తున్న కరోనా వ్యాక్సిన్లను బహిరంగ మార్కెట్లో విక్రయించడానికి డీసీజీఐ అనుమతులిచ్చింది. ఇకపై కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలను ఆస్పత్రులు, క్లినిక్‎లలో అందుబాటులోకి రానున్నాయి. వాటిలో వ్యాక్సిన్‌ను కొనుగోలు చేసి ప్రజలు అక్కడే వేయించుకోవచ్చు. అయితే ఈ వ్యాక్సిన్లు మెడికల్ షాపుల్లో అందుబాటులోకి రావడానికి మాత్రం మరింత సమయం పట్టనుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వ్యాక్సిన్లను ఆస్పత్రులు, క్లినిక్స్ కొనుగోలు చేసుకుని, వాటిని ప్రజలకు విక్రయించే వీలును మాత్రమే కల్పించింది డీసీజీఐ. అయితే బహిరంగ మార్కెట్‌లోకి టీకాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ ఫ్రీ వ్యాక్సినేషన్‌ను ప్రభుత్వం కొనసాగిస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు.

మరిన్ని వార్తల కోసం..

రైతంటే ఎవరో కేసీఆర్ చెప్పాలె

ఏపీలో ఆగని కరోనా విజృంభణ.. యాక్టివ్ కేసులు లక్ష పైనే

 

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఆన్‌లైన్‌లో దర్శనం టికెట్లు