
న్యూఢిల్లీ: వివిధ రోగాలకు వాడే 53 రకాల మందులు క్వాలిటీ టెస్టుల్లో ఫెయిల్ అయ్యాయని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్ సీఓ) తెలిపింది. నెలకు ఒకసారి విడుదల చేసే డ్రగ్ అలర్ట్ లిస్టును సీడీఎస్ సీఓ రిలీజ్ చేసింది. 53 రకాల మందులు స్టాండర్డ్ క్వాలిటీ అలర్ట్ లిస్టులో లేవని వెల్లడించింది.
ఆ మందుల్లో విటమిన్ సీ, డీ3 ట్యాబ్లెట్లు, విటమిన్ బీ కాంప్లెక్స్, విటమిన్ సీ సాఫ్ట్ జెల్స్, యాంటీయాసిడ్ ప్యాన్ డీ, పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ ఐపీ 500 ఎంజీ, యాంటీ డయాబెటిక్ డ్రగ్ గ్లైమ్ పిరైడ్, హైబీపీ డ్రగ్ టెల్మిసార్టన్ తదితర మందులు ఉన్నాయని సీడీఎస్ సీఓ వివరించింది. అవి దేశంలోనే అత్యధికంగా అమ్ముడుపోయే మందులు అని పేర్కొంది. కడుపు నొప్పికి వాడే మెట్రానిడాజోల్ కూడా క్వాలిటీ టెస్టులో ఫెయిలైందని తెలిపింది.