
హ్యుందాయ్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్..గురించి సినీ ఆడియన్స్ అందరికీ తెలిసిందే. ఉత్తమ భారతీయ హిందీ భాషా చిత్రాలను సత్కరించే టైమ్స్ గ్రూప్ ద్వారా నిర్వహించబడే వేడుకే ఈ హ్యుందాయ్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్. రేపు శనివారం (2025 అక్టోబర్ 11న) 70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ గుజరాత్‌లో జరగనుంది. అహ్మదాబాద్ కాంకరియా సరస్సు సమీపంలో ఉన్నEKA అరీనా స్టేడియంలో అట్టహాసంగా స్టార్ట్ అవ్వనుంది. ఇప్పటికే ఇక్కడికి సౌత్ సినీ స్టార్స్ విచ్చేస్తున్నారు. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, కరణ్ జోహార్, మనీష్ పాల్లు 70వ అవార్డు వేడుకను హోస్ట్ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ బాలీవుడ్ హీరో, హీరోయిన్స్ తమ స్పెషల్ పెర్ఫార్మన్స్తో ఆకట్టుకోనున్నారు. అయితే, రేపు శనివారం జరగబోయే అవార్డు వేడుకకు ముందు.. ఈ 70 ఏళ్ళ జర్నీలో హైలెట్ మూమెంట్స్ వైపు ఓ లుక్కేద్దాం..
Tomorrow, the red carpet rolls out and the magic unfolds at the #70thHyundaiFilmfareAwards2025WithGujaratTourism. ✨
— Filmfare (@filmfare) October 10, 2025
Book your tickets on District with a special discount of 30% off using the coupon code FF30🎉
See you at Eka Arena, Ahmedabad!
Title Partner: @hyundaiindia… pic.twitter.com/opMuKYq8q4
42వ ఫిలింఫేర్‌లో అత్యంత చిరస్మరణీయమైన క్షణాలలో ఒకటి నటుడు ధర్మేంద్రను షారుఖ్ ఖాన్, దిలీప్ కుమార్ మరియు సైరా బాను జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించడం. 1996లో విడుదలైన రాజా హిందుస్తానీ చిత్రానికి కరిష్మా కపూర్ ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది.అలాగే, కరిష్మా కపూర్ అండ్ ఛావా విలన్ అక్షయ్ ఖన్నా కలిసి ఈవెంట్ ముందు వరుసలో కూర్చొని ఆసక్తిగా పెరఫార్మన్స్ చూస్తుండటం.
Also Read : నన్ను మాత్రమే ఎందుకు టార్గెటింగ్.. 8 గంటలే పనిచేస్తున్న సూపర్ స్టార్స్ ఎందరో?
57వ ఫిలింఫేర్‌లో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ మరియు రణబీర్ కపూర్ లేడీ గెటప్స్లో డ్యాన్స్ చేసి అదరగొట్టారు. అంతేకాకుండా వారి లుక్స్ పరంగా బ్యూటీ మాధురి దీక్షిత్కు గట్టి పోటీ ఇస్తూ కవ్వించారు. ఆ సమయంలో వారి క్యూట్ ఎక్సప్రెషన్స్కి ప్రేక్షకులు నవ్వు ఆపుకోలేకపోయారు. ఈ క్షణం ఫిలింఫేర్‌లో అవార్డ్స్ లోనే స్పెషల్గా నిలిచేలా చేసింది.
60వ ఫిలింఫేర్‌లో.హైదర్ చిత్రంలో విమర్శకుల ప్రశంసలు పొందిన నటనకు షాహిద్ కపూర్, అమితాబ్ నుండి ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు.
61వ ఫిలింఫేర్‌లో.. వెండితెరపై పవర్ కపుల్గా నటించే దీపికా పదుకొనే మరియు రణవీర్ సింగ్లు పికు మరియు బాజీరావ్ మస్తానీ చిత్రాలకు వరుసగా ఉత్తమ నటి మరియు ఉత్తమ నటుడిగా అవార్డులను అందుకున్నారు . వారిని 2017లో, షారుఖ్ ఖాన్ మరియు కపిల్ శర్మ తమ అప్రయత్నమైన హాస్యంతో అతిథులను నవ్వించారు.
62వ ఫిలింఫేర్‌లో సల్మాన్ ఖాన్ అటెండ్ అయ్యి.. బాలీవుడ్ సూపర్ హిట్ చార్ట్‌బస్టర్‌లకు కిరాక్ స్టెప్పులేసి అలరించారు. ఆ క్షణంలో ఆడియన్స్, సినీ స్టార్స్ నుంచి చప్పట్లు మరియు వారి హర్షధ్వానాలు అందుకున్నప్పుడు, సల్మాన్ గొప్పతనం వేదికను బ్లాస్ట్ చేసేసింది. ఆ;అలాగే, ఇదే వేడుకలో బాలీవుడ్ బ్యూటీస్ అలియా భట్ మరియు సోనమ్ కపూర్ ఒకరినొకరు ఎదురుపడటంతో సంతోషకరమైన క్షణాలను షేర్ చేసుకున్నారు.
2018లో జరిగిన 63వ ఫిలింఫేర్‌లో.తుమ్హారీ సులు చిత్రానికి గాను విద్యాబాలన్‌కు ఉత్తమ నటి అవార్డును సీనియర్ నటి రేఖ అందజేశారు. అలాగే బద్రీనాథ్ కి దుల్హానియా చిత్రంలోని "రోకే నా రూకే నైనా" పాటకు అరిజిత్ సింగ్ ఉత్తమ బెస్ట్ సింగర్ అవార్డును గెలుచుకున్నారు.
ఇక 2024 ఏడాదికి గాను.. లాపాతా లేడీస్ రికార్డు స్థాయిలో 24 నామినేషన్లతో ముందుంది. ఇది ఒక సంవత్సరంలో ఒకే చిత్రానికి వచ్చిన అత్యధిక నామినేషన్లు. ఈ సినిమాతో పాటుగా మరిన్ని మూవీస్ అవార్డ్స్ బరిలో నిలిచాయి. ఇక ఈ 70వ ఫిల్మ్‌ఫేర్ లో విజేతలు ఎవరనేది మరికొన్ని గంటల్లో తెలియనుంది..