Chandrayaan-3: చంద్రయాన్ సక్సెస్... దేశవ్యాప్తంగా సంబురాలు

Chandrayaan-3: చంద్రయాన్ సక్సెస్... దేశవ్యాప్తంగా సంబురాలు

చంద్రయాన్ 3  సక్సెస్ తో దేశ వ్యాప్తంగా ప్రజల  సంబరాలు మిన్నంటాయి. జయహో భారత్ అంటూ నినదిస్తున్నారు.  టపాసులు కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.   టీవీల ముందు లైవ్ చూస్తున్న   వారంతా క్లాప్స్ కొడుతు కేరింతలు  కొట్టారు. స్కూళ్లల్లో విద్యార్థులు డ్యాన్స్ లు చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తల ప్రతిభను కొనియాడుతున్నారు. ఇస్రో పడిన కష్టానికి ప్రతిఫలం దక్కిందంటూ సెల్యూట్ చేస్తున్నారు. గుజరాత్ లోని సూరత్లో   విద్యార్థులు  డ్యాన్స్ లు చేస్తూ..స్వీట్లు పంచుకుని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. బార్డర్లో జవానులు కూడా  భారత జెండాలు ఊపుతూ భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. 

140 కోట్ల మంది  భారతీయులు తలుచుకుంటే  ఓటమి సైతం తలవంచుతుందని..  చంద్రుడి దక్షిణ ధృవంపై విక్రమ్ ల్యాండ్ అయ్యిందని  సోషల్ మీడియాలో  పోస్టులు పెడుతున్నారు. అతి తక్కువ బడ్జెట్ తోనే  ఎన్నో దేశాలకు సాధ్యం కాని విజయాన్ని భారత్  అందుకుని  చరిత్ర సృష్టించిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రయోగం సక్సెస్ కావడంతో యూఎస్ఏ, యూఎస్ఎస్ఆర్ , చైనా సరసన భారత్  నిలిచింది.

చంద్రయాన్ 3 చరిత్ర సృష్టించింది. జాబిల్లిపై ఇప్పటి వరకు ఏ దేశం దిగని దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ కాలు మోపి మీసం మెలేసింది. సాయంత్రం 5.44 గంటలకు ల్యాండింగ్ ప్రక్రియ మొదలవ్వగా 6.04 గంటలకు  చంద్రయాన్ 3 చందమామను ముద్దాడింది. అంతరిక్షంలో భారత ప్రతిష్టను చాటిది . చంద్రుడిపై అడుగు పెట్టిన నాలుగో దేశంగా చరిత్ర సృష్టించింది ఇక ఇవాళ్టి నుంచి 14 రోజుల పాటు చందమామపై రోవర్ పరిశోధనలు  చేయనుంది.